మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విస్తృత సోదాలు.. | ap-officials-third-day-searches-margadarsi-head-office-hyderabad | Sakshi
Sakshi News home page

మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విస్తృత సోదాలు..

Dec 16 2022 12:21 PM | Updated on Dec 16 2022 9:10 PM

ap-officials-third-day-searches-margadarsi-head-office-hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజూ విస్తృత సోదాలు  నిర్వహించారు. పంచనామా రిపోర్ట్‌ తీసుకునేందుకు మార్గదర్శి సిబ్బంది నిరాకరించారు. దీంతో రిపోర్టును గోడకు అధికారులు అతికించారు.

ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు సేకరించారు. మార్గదర్శి నిబంధనలకు విరుద్దంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిధుల మళ్లింపుపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇతర కంపెనీల్లో పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తనిఖీల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎంత మంది డిపాజిట్‌ చేశారన్న వివరాలను వెల్లడించకుండా మార్గదర్శి గుట్టుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించినట్లు పక్కా ఆధారాలు లభ్యమైన తరువాతే హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల పేర్కొన్నాయి.
చదవండి: గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement