నన్ను చంపేందుకు బీఆర్‌ నాయుడు ప్లాన్‌ చేస్తున్నాడు: పోసాని | AP FDC Chairman Posani Krishnamurali Serious on TV5 BR Naidu | Sakshi
Sakshi News home page

నన్ను చంపేందుకు బీఆర్‌ నాయుడు ప్లాన్‌ చేస్తున్నాడు: పోసాని

Sep 2 2023 5:16 PM | Updated on Sep 2 2023 6:57 PM

AP FDC Chairman Posani Krishnamurali Serious on TV5 BR Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ముసుగులో బీఆర్‌నాయుడు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. చంపించడం అనేది బీఆర్‌ నాయుడికి చాలా చిన్న పని అని అన్నారు. 

కాగా, పోసాని కృష్ణమురళి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీపై కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే అంతు చూస్తామని నన్ను బెదిరించారు. బీఆర్‌ నాయుడికి దివంగత నేత వైఎస్సార్‌ భిక్ష పెట్టారు. మీడియా ముసుగులో బీఆర్‌ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. ఆడవాళ్లపై టీవీ-5లో నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు లేరా? వారితో ఇలానే మాట్లాడుతారా?. ఇప్పటికైనా బీఆర్‌ నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి. 

సాంబశివరావు భాష ఏంటి?
ప్రశ్నించినందుకు నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు. ఇవ్వాలా? లేదా రేపో నన్న చంపొచ్చు. బీఆర్‌ నాయుడు టీవీ5 పెట్టినప్పుడు ఓ వ్యక్తి దగ్గర రూ.30కోట్లు అప్పుగా తీసుకుని ఇప్పటికీ ఇవ్వలేదు. మార్వాడీ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని చెదిరింపులకు పాల్పడ్డారు. మీడియాను అడ్రస్‌ చేయాలంటేనే నాకు భయమేస్తోంది. సినీ పరిశ్రమలో ఉన్న మహిళలను అవమానించినందుకు సాంబశివరావు ఇంట్లో తనను అడగరా?. తెలంగాణ ఆడబిడ్డలను తిట్టడానికే బీఆర్ నాయుడు.. సాంబశివరావును టీవీ-5లో పెట్టుకున్నాడు. సాంబశివరావు వాడుతున్న భాషను ఏ ఛానెల్ అయినా వాడుతుందా?. సాంబశివరావు వెనుక  చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ ఉన్నారు. నన్ను ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడినా నేను మాట్లాడటం ఆపను. 

సీఎం జగన్‌ గురించి ప్రజలకు తెలుసు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో నాతో వస్తే చూపిస్తాను. స్కూల్స్‌, ఉద్యోగులను, ఆసుపత్రులకు వెళ్లి చూపిస్తాను. నవరత్నాల పేరుతో సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమం ప్రజలందరికీ తెలుసు. సీఎం జగన్‌ను తిట్టడానికి ప్రతిపక్షాలకు కారణాలు లేవు. కుల, మతాలతో సంబంధం లేకుండా సీఎం జగన్‌ అభివృద్ధి చేస్తున్నారు. కమ్మ, కాపు అనే తేడా లేకుండా పేదలకు సంక్షేమం అందిస్తున్నారు. ఏపీలో ఇప్పుడున్న నాయకుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రమే మంచి పాలన అందిస్తున్నారన్నది నా అభిపాయ్రం’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: చం‍ద్రబాబుకు ముట్టిన 118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి: విజయసాయిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement