హిట్లర్‌, తుగ్లక్‌ కలిస్తే ఆయనే..: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి | Alleti Maheshwar Reddy says FCI Procures 60 pc Grain from Telangana | Sakshi
Sakshi News home page

హిట్లర్‌, తుగ్లక్‌ కలిస్తే ఆయనే..: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Jun 7 2026 4:14 PM | Updated on Jun 7 2026 4:33 PM

Alleti Maheshwar Reddy says FCI Procures 60 pc Grain from Telangana

సాక్షి, హైదరాబాద్‌: హిట్లర్‌, తుగ్లక్‌ కలిస్తే రేవంత్‌ రెడ్డి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి గులాంగిరీ చేస్తున్నారని చెప్పారు.

‘సాక్షి’తో మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో తెలంగాణ నుంచే ఎఫ్‌సీఐ 60 శాతం ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ‘‘హిట్లర్‌ ప్లస్‌ తుగ్లక్‌ కలిస్తే రేవంత్‌ రెడ్డి. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో అసమర్థ పాలన కొనసాగుతోంది. సోనియా గాంధీ కుటుంబానికి సలాం చేసేది రేవంత్‌ రెడ్డి.

పదవి కాపాడుకోవడానికి సోనియాకు పన్నులు కడుతున్నారు. 11 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ కట్టిన పన్నుల్లో 80 శాతం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చింది. సోనియా కుటుంబం ముందుకు రేవంత్‌ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement