Adibatla Medico Kidnap Case: Vaishali Allegations on Naveen Reddy - Sakshi
Sakshi News home page

ఫేక్‌ అకౌంట్లతో ఆ వీడియోలు పోస్ట్‌.. ఆ ఫొటోలన్నీ మార్ఫింగ్‌ చేసినవే: నవీన్‌రెడ్డిపై వైశాలి ఆరోపణ

Dec 12 2022 11:55 AM | Updated on Dec 12 2022 1:22 PM

Adibatla Medico Kidnap Case: Vaishali Allegations On NaveenReddy - Sakshi

మన్నెగూడ కిడ్నాప్‌ కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకోనుంది.. 

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన మన్నెగూడ కిడ్నాప్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. మరోసారి వైశాలి స్టేట్‌మెంట్‌ను ఇవాళ(సోమవారం) పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 32 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు.. 

ఆదిభట్ల మెడికో వైశాలి కిడ్నాప్‌ వ్యవహారంలో ఇవాళ దర్యాప్తు కొనసాగనుంది. పోలీసులకు ఆమె ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. అయితే.. వైశాలి మాత్రం నవీన్‌ రెడ్డి గతంలో ఇచ్చిన ప్రకటనలను తోసిపుచ్చుతోంది. 

ఏడాదిగా నవీన్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ వైశాలి చెబుతోందామె. పెళ్లి నిజం కాదని.. ఫొటోలు అన్నీ మార్ఫింగే అని వైశాలి అంటోంది. వైశాలి ఇంటి దగ్గర్లో ఉన్న ఖాళీ జాగాను లీజుకు తీసుకుని.. గానాభజానాతో  రోజూ హంగామా చేసేవాడట నవీన్‌. అంతేకాదు.. వైశాలి పేరిట నకిలీ అకౌంట్లు హంగామా వీడియోలను పోస్ట్‌ చేశాడు. ఇందుకు సంబంధించి వేధింపులపైనా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినట్లు చెబుతోంది. అయితే..  పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది.

సంబంధిత వార్త: వైశాలిని ఇప్పటికీ కూడా అంగీకరిస్తా!

Advertisement
 
Advertisement
Advertisement