హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు నాన్‌కేడర్ ఎస్పీల బదిలీ జరిగింది. ఎనిమిది మంది నాన్‌కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా అరవిందబాబు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సుదీంద్రలు బదిలీ అయ్యారు.
హైదరాబాద్ సైబర్‌క్రైమ్ డీసీపీగా ఉన్న దార కవితను బదిలీ చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా ఆమెను బదిలీ చేశారు. ఐబొమ్మ రవి కేసును కవిత దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా కేసు విచారణ జరుగుతుండగానే కవిత బదిలీ జరిగింది.


