
చార్మినార్: వాహనాల స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 700 వందలకు పైగా కేసులు నమోదు చేసినట్లు దక్షిణ మండలం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం చార్మినార్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావుతో కలిసి ఆయన పాతబస్తీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తనీఖీలలో పట్టుబడిన కార్లకు ఉన్న బ్లాక్ కవర్లను తొలగించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... దక్షిణ మండలంలోని పాతబస్తీలో ఇప్పటి వరకు నెంబర్ ప్లెట్‌లు సక్రమంగా లేని 190 వాహనాలపై, పోలీసు, అడ్వకేట్, ఎమ్మెల్యే, ఎంపీ, డాక్టర్ స్టిక్కర్లతో వచ్చిన 46 వాహనాలతో పాటు బ్లాక్ ఫిల్మ్‌లతో కూడిన 500 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
(చదవండి: Ram Charan: రామ్ చరణ్ బర్త్‌డే.. అదిరిపోయిన అభిమాని గిఫ్ట్)