మామిడిపండ్లు తిన్న అనంతరం అమ్మాయి మృతి | 17 Year Girl Ends Life in Hyderabad | Sakshi
Sakshi News home page

మామిడిపండ్లు తిన్న అనంతరం అమ్మాయి మృతి

Jun 9 2026 7:28 AM | Updated on Jun 9 2026 7:28 AM

 17 Year Girl Ends Life in Hyderabad

మరో నలుగురికి వాంతులు, విరేచనాలు 

హైదరాబాద్‌: మామిడిపండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఓ  బాలిక మృతి చెందింది.  నారాయణగూడ ఎస్‌ఐ సాయి సందీప్‌ తెలిపిన మేరకు.. బీదర్‌ చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు విఠల్‌ వాడిలో ఉంటున్నారు.  నివారం వారి బంధువు రేణుక  నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొనుగోలు చేసుకుని వీరి ఇంటికి వచ్చింది. ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు ఆదివారం తిన్నారు.  అయితే అందరికీ వాంతులు, విరేచనాలు  కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్‌  ఆస్పత్రికి  వెళ్లారు.  మూడో కుమార్తె భువనే శ్వరి(17) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement