12 ఏళ్లుగా.. రూ.12 కోట్లతో..

12 Crore And 12 Years For Balaji Temple Construction In Dubbaka - Sakshi

దుబ్బాక టౌన్‌: కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామి ఆలయం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రూ.12 కోట్ల నిధులతో 12 ఏళ్లపాటు నిర్మాణం జరిగి అద్భుతంగా రూపుదిద్దుకుంది. 2009 నవంబర్‌ 1న చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా భూమి పూజ పనులు ప్రారంభించారు. రెండు ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయంలో మొదటి అంతస్తులో స్వామి వారి మూలవిరాట్టు, కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమ వైపు గోదాదేవి ఆలయాలు నిర్మించారు. విశ్వక్సేనుడు, పంచముఖ ఆంజనేయస్వామి, గరుత్మంతుని ఉపాలయాలను నిర్మించారు. ధ్వజస్తంభపు కలపను నల్లమల అడవుల నుంచి, మూల విరాట్‌ విగ్రహాలు తమిళనాడులోని మహాబలిపురంలో, ఉత్సవ విగ్రహాలను కుంభకోణంలో తయారు చేయించారు. ఈ ఆలయంకోసం రూ. 4.25 కోట్లు ప్రభుత్వం కేటాయించగా, రూ. 7.75 కోట్లు విరాళాల ద్వారా సేకరించారు. 

చినజీయర్‌ చేతులమీదుగా.. 
20న ఉదయం 10.28 నిమిషాలకు త్రిదండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ఆలయం ప్రారం¿ోత్సవం, విగ్రహాలకు ప్రాణప్రతిష్ట జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్‌ దంపతులు, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, ఆలయ శాశ్వత చైర్మన్‌ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావులు కుటుంబసమేతంగా హాజరుకానున్నారు. కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్‌ డేవిస్‌లు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top