తమిళనాడు అసెంబ్లీలో ‘నీట్‌’ రగడ

Tamil Nadu CM Stalin Says May Convene All Party Meet On NEET - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) అంశం సోమవారం అసెంబ్లీలో మ రోమారు చర్చకు వచ్చింది. నీట్‌ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపించేందుకు, గవర్నర్‌ ఎన్‌ఆర్‌ రవి సమ్మతించారంటూ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నే పథ్యంలో వాస్తవ పరిణామాలను పరిశీలించిన తరువాత అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం స్టాలిన్‌ సభలో వెల్లడించారు.  

తేనేటి విందుకు గైర్హాజరుపై లేఖ.. 
తమిళనాడు అసెంబ్లీలో 110 విధుల కింద సీఎం స్టాలిన్‌ ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులోని వివరాలు.. ‘ఏడున్నర కోట్ల తమిళ ప్రజానీకం ప్రతిఫలించేలా అసెంబ్లీలో ఆమోదించిన నీట్‌ వ్యతిరేక తీర్మానం గత 210 రోజులుగా రాజ్‌భవన్‌లోనే పడి ఉంది. వందేళ్లు పూర్తి చేసుకున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీట్‌ మినహాయింపు బిల్లు చెన్నై గిండీలోని రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ఎవరికీ పట్టని విధంగా మూలవేశారు. అలాంటి రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందుకు ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకావడం ప్రజాభీష్టాన్ని అవమానించడమే అవుతుంది. అందుకే గవర్నర్‌ ఇచ్చిన తేనీటి విందుకు గైర్హాజరయ్యాం. ఈ పరిస్థితులకు సంబంధించి గవర్నర్‌కు నేనే ఓ ఉత్తరం రాశాను. మీతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి భేధాభిప్రాయం లేదు, సామాజిక బాధ్యతకు కట్టుబడే తేనీటి విందుకు రాలేదని ఆ ఉత్తరంలో స్పష్టం చేశాను. మా ప్రభుత్వ విధానాల గురించి గవర్నరే బహిరంగ వేదికలపై ప్రశంసించారు.

గవర్నర్‌ అనే హోదాకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ తగిన గౌరవం ఇస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు లభించే ప్రశంసల కంటే రాష్ట్ర ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. అలాగే గవర్నర్‌ సైతం ఈ అసెంబ్లీని గౌరవించి నీట్‌ వ్యతిరేక తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. అలా పంపక పోవ డం తమిళనాడు ప్రజలను అవమానించడమే అవుతుంది. ఇదే గవర్నర్‌ గతంలో తిప్పిపంపిన నీట్‌ వ్యతిరేక తీర్మానంపై ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరోసారి తీర్మానం చేసి రాజ్‌భవన్‌కు పంపి 70 రో జులు అవుతోంది. ఈ పరిస్థితుల్లో సదరు తీర్మానా న్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని గవర్నర్‌ నిర్ణయించుకున్నట్లు మీడియాలో ప్రచారం అవుతోంది. ఈ ప్రచారాన్ని వాస్తవం చేస్తూ జరిగే పరిణామాలను గమనిస్తాం, అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి చర్యలపై ముందుకు సాగుతాం..’అని స్టాలిన్‌ పేర్కొన్నారు.  

ముల్‌లెపైరియార్‌ వ్యవహారంపై.. 
ముల్‌లెపైరియార్‌ ఆనకట్ట వ్యవహారంలో చట్టపరమైన చర్యలపై సీఎం, అఖిలపక్ష నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి దురైమురుగన్‌ అసెంబ్లీలో తెలిపారు. అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే పార్టీల అసెంబ్లీ సభ్యులు సోమవారం నాటి అసెంబ్లీలో ముల్‌లెపైరియార్‌ ఆనకట్టపై ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రి దురైమురుగన్‌ ఈ మేరకు బదులిచ్చారు. ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్ష ఉప నేత ఓ పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ, కేరళ ప్రభుత్వం ముల్‌లెపైరియార్‌ ఆనకట్ట విషయంలో ఏకపక్షంగా సర్వే చేస్తోందని, అక్కడి బేడీ ఆనకట్ట, సిట్రనై ఆనకట్ట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలన కోసం తమిళనాడు నుంచి వెళ్లినవారిని కేరళ ప్రభుత్వం అడ్డుకుంటోందని చెప్పారు.

కేరళ ప్రభుత్వంతో తమిళనాడు సీఎంకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నందున తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే తమిళనాడులో వేసవి కాలంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరాకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకుంటున్నాం.. రాష్ట్రంలో విద్యుత్‌ కోత అనే మాటకు ఎంతమాత్రం చోటు లేదని మంత్రి సెంథిల్‌ బాలాజీ స్పష్టం చేశారు. మధుర మీనాక్షిని దర్శనానికి మధుౖ రెకి వచ్చే భక్తుల కోసం రూ.35 కోట్లతో అతి గృహాలు నిర్మిస్తున్నట్టు మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.  

ఇది చదవండి: సాధ్వి రితంబ‌ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top