రూ. 8 వేల కోట్లు అమ్మకాలు
చైన్నెలో టన్నుల కొద్ది పేరుకు పోయిన చెత్త
పెరిగిన కాలుష్యం– విమానాల
సేవలకు ఆటకం
దీపావళి సంబరాలు ముగియడంతో స్వస్థలాలకు వెళ్లిన జనం సోమవారం సాయంత్రం నుంచి తిరుగు పయనం అయ్యారు. .వీరి కోసం ఆయా మార్గాలు,వివిధ ప్రాంతాల నుంచి చైన్నె వైపుగా సాదారణ బస్సులతో పాటుగా అదనంగా ప్రత్యేక బస్సులను రవాణా సంస్థ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంది. చైన్నె వైపుగా 5600 బస్సులను నడిపారు. టోల్ గేట్ల వద్ద కిలో మీటర్ల కొద్ది దూరం వాహనాలు బారులు తీరాయి. మంగళవారం నగరంలో ట్రాఫిక్ రద్దీ అన్నది ఎదురు ట్రాఫిక్ పోలీసులు పకడ్భందీగా చర్యలు తీసుకున్నారు. తిరుగు ప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆమ్నీ బస్సులలో చార్జీలు పెరిగాయి. విమాన చార్జీలకు సైతం రెక్కలు వచ్చాయి.
సాక్షి, చైన్నె : దీపావళి పర్వదినం రోజున ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో తలంటు స్నానాలు, కొత్తబట్టలు, పిండి వంటలు, స్వీట్ల పంపకాలతో ఆనందాన్ని పంచుకున్నారు. చైన్నె శివారులోని మహాబలిపురంతో పాటూ పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో విదేశీయులు దీపావళి సంబరాలలో భాగస్వాములయ్యారు. సినీ సెలబ్రటీలు తమ తమ కుటుంబాలతో పండుగను జరుపుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు బాణా సంచాలను హోరెత్తించారు. చైన్నె శివారులే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల వర్షం మోస్తారుగా పడ్డా, ఈ ఏడాది బాణ సంచాల విక్రయాలు జోరుగానే జరిగా యి. కొందరు అయితే, నిబందనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా బాణా సంచాలను పేల్చడంతో పోలీసులుకన్నెర్ర చేశారు. కోయంబత్తూరు, తేని, ఈరోడ్, తదితర జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బాణ సంచాలకు దూరంగా పండుగను జరుపుకున్నారు. ఇక, బాణా సంచాల మోతతో చెత్తతో పాటుగా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. చైన్నెలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుంగుడి, ఆలందూరు, తాంబరం, మీనాంబాక్కం పరిసరాలలో అమాంతంగా గాలిలో కాలుష్యం పెరిగింది. రోడ్లు కనిపించక పోవడంతో వాహన దారులు అవస్థలు పడాల్సి వచ్చింది. సోమవారం ఉదయాన్నే పొగ కప్పేయడంతో వాహనదారులకు అవస్తలు తప్పలేదు. ఇక, చైన్నెలో 26 విమాన సేవలకు తీవ్ర ఆటంకం కలగడంతో సేవలు ఆలస్యంగా జరిగాయి. విమానాశ్రయం, రన్‌వేను పొగ ముంచేసినట్లయ్యింది. ఇక, బాణ సంచాలతో పేరుకు పోయిన చెత్తను తొలగించేందుకు సోమవారం ఉదయాన్నే చైన్నెలో వేల మంది సిబ్బంది రంగంలోకి దిగారు. చైన్నెలోని వేలాది వీధులలో పేరుకు టన్నుల కొద్ది పేరుకు పోయిన చెత్తను తొలగిస్తున్నారు.
బాణాసంచా ప్రమాదాలు
తమిళనాడులో దీపావళి వేడుక సందర్భంగా టపాసులు కాల్చిన వేళ జరిగిన వివిధ ప్రమాదాల్లో ఒక బాలుడితో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాణాసంచా గాయాలు, ఇతర ప్రమాదాల కారణంగా మొత్తం 4,098 మంది రోగులు ఆసుపత్రులలో చేరి చికిత్స పొందినట్లు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు ఈనెల 7 ఉదయం 7 గంటల నుండి 9వ తేది ఉదయం 7 గంటల వరకు అందిన వివరాల ప్రకారం ఈ నివేదికను విడుదల చేశారు. ఈ రెండు రోజుల్లో 108 అత్యవసర సేవల కాల్ సెంటర్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున కాల్స్ అందాయని వివరించారు. వీటిలో ప్రమాదాలు, గాయాలకు సంబంధించి 6,317 కాల్స్, దాడి గాయాలకు సంబంధించి 1,627 కాల్స్, బాణా సంచా తుపాకీ గుండు గాయాలకు సంబంధించి 462 కాల్స్ వచ్చాయని వివరించారు. ప్రమాదవశాత్తు గాయపడినవార 2,541 మంది ఉన్నారు.తీవ్రమైన దెబ్బల బారిన పడినవారు: 1,127 మంది కాలిన గాయాలతో చేరినవారు 430 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాణా సంచాల అమ్మకాలు రూ.8 వేల కోట్లకు జరిగినట్టు అంచనా వేశారు. చైన్నెలోనిబంధనలు ఉల్లంఘించిన బాణా సంచాలనుపేల్చినందుకు 237 కేసులునమోదు అయ్యాయి. ఓ విద్యార్థి మరణించాడు.
పండుగ వేళ బాణసంచా మోత


