ఘనంగా కలై సువై అవార్డుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కలై సువై అవార్డుల ప్రదానం

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

కొరుక్కుపేట: 65 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన జూనియర్‌ కుప్పన్న ఆధ్వర్యంలో కలై సువై అవార్‌ుడ్స –ది మాస్టర్స్‌ ఆఫ్‌ టేస్ట్‌ అండ్‌ ఆర్ట్‌ మొదటి ఎడిషన్‌ వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు . చైన్నెలోని కేథడ్రల్‌ రోడ్డులోని జరిగిన కార్యక్రమంలో తమిళ కళ , సంస్కృతి, ఆహారం, వారసత్వానికి అంకితమైన ప్రముఖులు , ప్రఖ్యాత చెఫ్‌లు , సాంప్రదాయ కళాకారులు, పరిశ్రమ నాయకులు, సాంస్కృతిక ప్రియులను ఒకే చేర్చి ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎంపీ ప్రవీణ్‌ చక్రవర్తి తోపాటు ప్రత్యేక అతిథులుగా జూనియర్‌ కుప్పన్న డైరెక్టర్‌ బాలచందర్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ హరిశంకర రాజశేఖర్‌ , బేసిక్స్‌ అపెరల్‌ సహ వ్యవస్థాపకులు సుహైల్‌ సత్తార్‌ టాప్‌ రాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ మురళీ కుమార్‌ , జోహో అండ్‌ ముథల్‌ సహ వ్యవస్థాపకులు కుమార్‌ వెంబు పాల్గొని గోటెడ్‌ రూటెడ్‌ కొత్త ప్రచారాన్ని ఆవిష్కరించారు . కలై సువై అవార్డులను రెండు విభాగాలలో ఏడుగురు విశిష్ట వ్యక్తులను సత్కరించారు. ఇందులో దార్శినిక చెఫ్‌ల విభాగంలో చెఫ్‌ శ్రీనివాస్‌ వెంకటేశన్‌ ,చెఫ్‌ ధీన దయాలన్‌ , చెఫ్‌ భూపేష్‌ పిచ్చుమణి , కళా దిగ్గజాల విభాగంలో డాక్టర్‌ ఆర్‌ కాశీశ్వరన్‌, తిలగవతి పళని , మాళవిక రాజేష్‌, శ్రీమంతి బృందా సారథికి అవార్డులను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో దివంగత పద్మశ్రీ చెఫ్‌ డాక్టర్‌ దామోదరన్‌కు ప్రత్యేక నివాళి అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement