సాక్షి,చైన్నె : చైన్నెలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్య అద్భుతాన్ని సాధించారు. మల్టీసిస్టమ్ లాంగర్‌హాన్స్ సెల్ హిస్టియోసైటోసిస్ అనే అరుదైన రుగ్మతతో బాధపడుతూ, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కారణంగా రష్యా నుండి ప్రత్యేక విమానంలో చైన్నెకి తీసుకువచ్చిన 15 నెలల బాలుడికి వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి లేకుండానే విజయవంతంగా చికిత్స అందించారు. బాలుడు తీవ్రమైన సిస్టిక్ ఊపిరితిత్తుల వ్యాధి, పదేపదే ఊపిరితిత్తులు కుప్పకూలడం (న్యుమోథొరాక్స్) వంటి సంక్లిష్ట సమస్యలతో బాధపడుతుండటంతో మొదటగా ఊపిరితిత్తుల మార్పిడి కోసమే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, మార్పిడి అనేది కోలుకోలేని సంక్లిష్ట ప్రక్రియ కావడం తో ఆసుపత్రికి చెందిన నిపుణుల బందం ప్రత్యామ్నాయ శస్త్రచికిత్సా మార్గాలను ఎంచుకుంది. ఊపిరితిత్తుల నుండి గాలితో నిండిన పెద్ద ఖాళీలను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఊపిరితిత్తులలోని వ్యాధిగ్రస్త భాగాన్ని మాత్రమే తొలగించేలా అతి తక్కువ కోతతో శస్త్రచికిత్స జరిపారు. ఊపిరితిత్తుల చుట్టూ చిక్కుకున్న గాలిని తొలగించి, అవి తిరిగి విస్తరించేలా పదేపదే డ్రెయిన్ చేశారు.ఈ చికిత్స విజయంతంతో బాలుడు పూర్తిగా కోలుకున్నాడు.ఈ వివరాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆర్. బాలకష్ణన్ , కో–డైరెక్టర్ డాక్టర్ సురేష్ రావు కె.జి. నాయకత్వంలో పీడియాట్రిక్ పల్మనాలజీ, కార్డియాక్ క్రిటికల్ కేర్, హెమటాలజీ, థొరాసిక్ సర్జరీ సహా బహుళ విభాగాల వైద్యుల బందం విజయవంతం చేశారు.


