కేఎన్‌ నెహ్రూకు చుక్కెదురు! | - | Sakshi
Sakshi News home page

కేఎన్‌ నెహ్రూకు చుక్కెదురు!

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

● పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

సాక్షి, చైన్నె : తమిళనాడు మున్సిపల్‌ పరిపాలన శాఖలో అధికారుల నియామకాలలో జరిగిన అవకతవకలు , లంచాల ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి, డీఎంకే సీనియర్‌ నాయకుడు కే.ఎన్‌. నెహ్రూకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో తమిళనాడు పట్టణ పరిపాలన , తాగునీటి సరఫరా శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్లు, జూనియర్‌ ఇంజనీర్లతో సహా మొత్తం 2,538 మంది ఉద్యోగాల నియామకాల కోసం రూ. 634 కోట్ల మేర లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సేకరించిన ఆధారాల ప్రకారం, ఈ వ్యవహారంపై డీవీఏసీ ద్వారా కేసు నమోదు చేయాలని కోరుతూ అన్నాడీఎంకే నేత ఇన్బదురై దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు విచారణ జరిపి, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఉత్తర్వులు జారీ చేసింది. తన వాదనలు వినకుండా ఇచ్చిన ఉత్తర్వులను పునర్‌ సమీక్షించాలని కేఎన్‌ నెహ్రూ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement