తిరువళ్లూరు: నిరుపేదల ఓట్లును తొలగించి తద్వా రా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వుందని ఎంఎల్‌సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్‌కుమార్‌ను వెంటనే తొలగించాలి, ఓట్లు చోరిపై విచారణ చేయాలని నవంబర్ 1న న్యూఢిల్లీలో భారీ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ర్యాలీలో తమిళనాడు నుంచి పెద్దఎత్తున క్యాడర్‌ను తరలించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర పరిశీలకుడు ఎంఎల్‌సీ అన్ని జిల్లాలకు వెళ్లి క్యాడర్‌తో సమావేశమై ర్యాలీలో పాల్గొనాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు వచ్చిన ఎంఎల్‌సీ వెంకట్‌కు డీసీసీ అధ్యక్షుడు శశికుమార్ నేతృత్వంలోని పార్టీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బల్మూరి వెంకట్ మాట్లాడుతూ బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు దేశంలోని నిరుపేదలు, సామాన్యులకు వున్న ఓటు హక్కును హరించడానికి ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్‌కుమార్ సహకారంలో బీజేపీ ఓటర్లు జాబితా తయారీలో అవకతవకలకు పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషనర్‌ను తొలగించడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో నేతలు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కాంగై కుమార్, అరుల్‌రాజ్(కాంచీపురం), సెంథిల్‌కుమార్, ప్రభు(చెంగల్‌పట్టు) ఆవడి కార్పొరేషన్ అధ్యక్షుడు అమిత్‌బాబు, ఓబీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేషన్, యువజన విభాగం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివాకర్, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలీల్‌రహ్మాన్, పార్టీ నేతలు షణ్ముగం, ప్రేమ్, సతీష్ పాల్గొన్నారు.


