సాక్షి, చైన్నె: ప్రముఖ శిల్పకళా, గృహ అలంకరణ బ్రాండ్ సిలై తమ సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన నలుగురు ఉద్యోగులకు అరుదైన గౌరవాన్ని అందించింది. చైన్నెలోని వీజీపీ రిసార్ట్స్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలల ప్రయాణానికి చిహ్నంగా నలుగురు సిబ్బందికి అధునాతన కార్లను ఉచితంగా బహుకరించింది. సంస్థ ప్రారంభ రోజుల నుండి అంకితభావంతో పనిచేస్తున్న రాహుల్ కిషన్, మిథున్ మోహన్, నిషాంత్, సత్య నారాయణన్లకు ఈ కార్లను అందజేశారు. ఉద్యోగులే కాకుండా, వారి కుటుంబ సభ్యులే స్వయంగా తమకు నచ్చిన కార్లను ఎంపిక చేసుకున్నారు. ఈ అద్భుతమైన ఆలోచన వెనుక ఉన్న కథను సిలై సంస్థ సీఈఓ , వ్యవస్థాపకుడు అరుణ్ టైటన్ వివరించారు. ఒక కుటుంబ శుభకార్యంలో, తమ సంస్థలో చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తన కుటుంబంతో కలిసి ద్విచక్రవాహనంపై సుదీర్ఘ ప్రయాణం చేసి రావడం తన దృష్టిలో పడిందనానరు. తాము అనుభవిస్తున్న రక్షణ, సౌకర్యం తమ సంస్థను నిర్మించిన వారికి కూడా దక్కాలని భావించినట్టు, ఈ సర్ప్రైజ్ విషయాన్ని రహస్యంగా ఉంచి, ఉద్యోగులందరినీ ఒక డిన్నర్కు ఆహ్వానించి లేఖల ద్వారా సర్ ప్రైజ్ చేశామన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పిలిపించి నచ్చిన కార్లను ఎంచుకునే వెసులుబాటు కల్పించామన్నారు.


