పళ్లిపట్టు: నవరాత్రి ఉత్సవాల్లో గజలక్ష్మి అలంకరణలో కొళ్లాపురమ్మ భక్తులకు కనువిందు చేశారు. పళ్లిపట్టు గ్రామ దేవత కొళ్లాపురమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవ వేడుకలు కోలాహలంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి రోజూ అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో ఆరవ రోజైన శుక్రవారం రాత్రి అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో కనువిందు చేశారు. అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. మహిళలు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు.


