విడిపోయిన వారిని అక్కున చేర్చుకోవాలి..! | - | Sakshi
Sakshi News home page

విడిపోయిన వారిని అక్కున చేర్చుకోవాలి..!

Oct 18 2026 2:18 AM | Updated on Oct 18 2026 2:18 AM

● మాజీ మంత్రి ● పార్టీని వీడే ప్రసక్తే లేదని వ్యాఖ్య

ఎస్‌.పి. వేలుమణి స్పష్టీకరణ

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే వీడి వెళ్లిన నాయకులందరినీ మళ్లీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పార్టీని తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి, తొండముత్తూరు ఎమ్మెల్యే ఎస్‌.పి. వేలుమణి అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఏస్‌పీ వేలుమణి గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చలలో మునిగిన ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన సన్నిహిత నేత సీవీ షణ్ముగం మీడియా ముందుకు వచ్చి పార్టీ బలోపేతం గురించి వ్యాఖ్యలు చేశారు. తాజాగా శనివారం కోయంబత్తూరులో మీడియా ప్రతినిధులతో వేలుమణి మాట్లాడారు.

నాయకత్వ ఆశలు లేవు..

తనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పీఠాన్ని దక్కించుకోవాలనే ఆలోచన గానీ, ఉద్దేశం గానీ లేదన్నారు. పార్టీ వీడిన వారిని ఏకం చేసి, అన్నాడీఎంకే కు పూర్వవైభవానికి తీసుకురావడమే నా ఏకై క లక్ష్యంగా స్పష్టం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో , 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూటమి సమీకరణాలు సరిగ్గా ఉండి ఉంటే పార్టీ ఫలితాలు వేరేలా ఉండేవి అని వివరించారు. గతంలో డీఎండీకే, , పుదియ నీది వంటి భాగస్వామ్య పక్షాలను సరిగ్గా సమన్వయం చేసుకోలేపోయామని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని, విడిపోయిన అందరినీ తిరిగి ఆదరించాలని కోరుతున్నట్లు తెలిపారు. శశికళ, టీటీవీ దినకరన్‌, ఓ. పన్నీర్‌సెల్వంతో పాటు పార్టీని వీడిన నాయకులు, కార్యకర్తలందరూ తిరిగి ఏకమైతేనే అన్నాడీఎంకే మళ్లీ తమిళనాడులో అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement