ముగిసిన స్వచ్ఛతాహి సేవ 2026 కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన స్వచ్ఛతాహి సేవ 2026 కార్యక్రమం

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

కొరుక్కుపేట: పరిశుభ్రత, జన భాగస్వామ్యం, యువత భాగస్వామ్యం, సఫాయి మిత్రుల సంక్షేమంపై 15 రోజుల పాటు చేపట్టిన స్వచ్ఛతాహి సేవ 2026 ప్రచార కార్యక్రమం శుక్రవారం ముగిసింది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్‌ డాక్టర్‌ ఎం.జి.ఆర్‌ చైన్నె సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛతాహి సేవ 2026 ప్రచార కార్యక్రమం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ యు.సుబ్బారావు, అదనపు జనరల్‌ మేనేజర్‌ విపిన్‌ కుమార్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌– చైన్నె శైలేంద్ర సింగ్‌, అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్లు అంకుర్‌ చౌహాన్‌, డాక్టర్‌ ఐ.సెంథిల్‌ కుమార్‌, అలాగే చైన్నె డివిజన్‌ బ్రాంచ్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతాహి సేవా క్యాంపెయిన్‌ 2026 సందర్భంగా చైన్నె డివిజన్‌లో 1,851 పరిశుభ్రతా లక్ష్య యూనిట్లలో శుభ్రపరచడం, శానిటైజేషన్‌ ప్రక్రియలో 8,274 మంది పాల్గొన్నారని తెలిపారు. 585 ప్రదేశాలలో డీప్‌ క్లీనింగ్‌ కార్యక్రమాలు నిర్వహించి, చెత్తను తొలగించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement