తిరువళ్లూరు: దేశ సాతంత్య్ర సాధనలో గాంధీజీ పాత్ర కీలకమని కలెక్టర్ కవిత తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ కవిత మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ శాంతియుతంగా పోరాటం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. గాంధీజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అహింసకు పోకుండా ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం మేనేజర్ వెంకటేషన్, పీఆర్వో అశ్విన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పళ్లిపట్టులో..
పళ్లిపట్టు: స్థానికంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ శుక్రవారం గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొదటూరుపేటలో పార్కులో గాంధీ విగ్రహానికి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు రమేష్ పూలమాల వేసి నివాళులర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. బీడీఓ కార్యాలయంలో బీడీఓ స్టాలిన్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆర్కేపేటలోని బీడీఓ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి బీడీఓ ముత్తు పూలమాల వేసి అంజలి ఘటించారు. తిరుత్తణి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కన్నియప్ప న్ గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.


