తమిళసినిమా: 2017లో విడుదలైన మరకత నాణయం చిత్రం తమిళంతో పాటు తెలుగు భాషలోనూ మంచి విజయాన్ని సాధించింది. నటుడు ఆది పినిశెట్టి, నిక్కీగల్రాణి జంటగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ కే శరవణన్ కథ, దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. సుమారు దశాబ్దం తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా మరకత నాణియం 2 చిత్రం రూపొందుతోంది. ఏఆర్ కే.శరవణన్ కొంత దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో ఆది, నటి ప్రియా భవానీ శంకర్, నిక్కీ గల్రాణి, మునీష్ కాంత్, ఆనంద్ రాజ్, డేనియల్, అరుళ్ రాజా కామరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఫ్యాషన్ స్టూడియోస్, దంగల్ టీవీ, ఆర్‌డీసీ మీడియా, యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ, గుడ్ షొ సంస్థల అధినేతలు సుదన్ సుందరం, మనీషా సింఘాల్, దుర్గారామ్ చౌదరి, దేవ్, కేళి.దురై కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తొలి భాగం కంటే మరింత బలమైన కథాంశంతో దర్శకుడు తెరకెక్కించారని తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. దీంతో మరకత నాణియం 2 చిత్రంపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు పెరుగుతున్నాయి.
తమిళ సినిమా: చైన్నె, వడపళనిలోని కమలా థియేటర్ శుక్రవారం ఉదయం అభిమానుల తో కిటకిటలాడింది. ఇందుకు కారణం సిగ్మా చిత్రం విడుదల కావడమే. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వారసుడు జసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం సిగ్మా. నటుడు సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్ జంట గా నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. అనిరుద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. తొలిసారిగా దర్శకుడిగా పరిచయమైన జోసెఫ్ సంజయ్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా తన కొడుకు జెసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రాన్ని చూడడానికి ఆయన తల్లి, సీఎం సతీమణి సంగీత, సోదరి దివ్యా సాషా లండన్ నుంచి చైన్నెకి వచ్చారు. వడపళనిలోని కమలా థియేటర్‌లో చిత్రాన్ని తిలకించారు. సమీప కాలంలో ఏ సినీ కార్యక్రమాల్లోనూ పాల్గొనని సంగీత, కూతురు దివ్యసాషా ఇప్పుడు సిగ్మా చిత్రం చూడడానికి లండన్ నుంచి చైన్నెకి రావడం ప్రత్యేక అంశంగా మారింది. వారిని చూడటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. దీంతో థియేటర్ జన సంద్రంగా మారింది.
అమ్మ, చెల్లి హ్యాపీ
చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న దర్శకుడు జెసన్ సంజయ్ మీడియాతో ముచ్చటిస్తూ తన తాత (సీఎం విజయ్ తండ్రి ఎస్‌ఏ.చంద్రశేఖర్) నుంచి ఎలాంటి సందేహాలు తీసుకోకపోయినా దర్శకుడిగా ఆయన ప్రభావం తనపై ఉందని చెప్పా రు. అదే విధంగా తాను ఇంతకు ముందు అమెరికాలో పలు షార్ట్ ఫిల్మ్స్ చేశా నని తెలిపారు. ఆ అనుభ వం ఈ చిత్రానికి ఉపయోగపడిందని చెప్పారు. ఇకపోతే సిగ్మా చిత్రాన్ని చూసిన తన తల్లి, చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, ఈ చిత్రం మూడేళ్ల శ్రమ అని పేర్కొన్నారు.
సిగ్మా చిత్రం కోసం
చైన్నెకి
సీఎం సతీమణి, కుమార్తె


