క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

120కి పైగా నగరాలకు డెలివరీ

సాక్షి, చైన్నె : అల్ట్రా–ఫాస్ట్‌ డెలివరీ సర్వీస్‌ను 120కి పైగా నగరాలకు విస్తరించామని అమెజాన్‌ ఇండియా, ఎవ్రీడే ఎసెన్షియల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హర్ష్‌ గోయల్‌ తెలిపారు. రెండు వారా ల్లోనే ఈ పరిధిని రెట్టింపు చేశామన్నారు. ఈ సేవ ఇప్పుడు అనేక నగరాల్లో అందుబాటులో ఉందని, దీని ద్వారా వినియోగదారులు అనేక రకాల ఉత్పత్తులను నిమిషాల వ్యవధిలోనే పొందుతున్నారని తెలిపారు. అమెజాన్‌ నౌ, కిరాణా సామగ్రి, పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్‌ ఫుడ్‌, పర్సనల్‌ కేర్‌, ఫ్యాషన్‌, బ్యూటీ ఉత్పత్తులు, చిన్న గృహోపకరణాలు, ఇంటి, వంటగది ఉత్పత్తులు, పదివేల నిత్యావసర వస్తువులను అందిస్తుందని వివరించారు. దాదాపు 800 మైక్రో–ఫుల్‌ఫిల్‌మెంట్‌, అర్బన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాల నెట్‌వర్క్‌ ద్వారా ఆర్డర్లు చేస్తున్నట్టు తెలిపారు. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌కు ముందు, అమెజాన్‌ నౌ ద్వారా మారుమూల ప్రాంతాలకు అత్యంత వేగవంతమైన డెలివరీలను తీసుకువెళ్లడం ఆనందంగా ఉందన్నారు.

తిరుత్తణి కొండపైకి

ఆటోలను అనుమతించాలి

తిరువల్లూరు: భక్తుల సౌకార్‌ాద్యం తిరుత్తణి కొండపైకి ఆటోలను అనుమతించాలని సీఐటీయూ ఆటో యూనియన్‌ కార్మికుల సంఘం సమావేశంలో తీర్మానం చేశారు. పొన్నేరిలో శుక్రవారం ఉదయం తిరువళ్లూరు జిల్లా ఆటో కార్మికుల సంఘం మహానాడు నిర్వహించారు. దీనికి సంఘం అధ్యక్షుడు కరీముల్లా అధ్యక్షత వహించగా జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రన్‌, జిల్లా కార్యదర్శి కాళమేగం తదితరులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా సీఐటీయూ కోశాధికారి నిత్యానందం హాజరై ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా ఆటోలకు సీఎన్‌జీ గ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని, అర్హులైన కార్మికులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని తీర్మానించారు. తిరుత్తణికి వచ్చే భక్తులకు ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని కొండపైకి ఆటోలను అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

తూతూమంత్రంగా రూ.35లకే ఉల్లి పంపిణీ

తిరువొత్తియూరు: బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలను అదుపు చేసేందుకు, అముధం చౌకధరల దుకాణాల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.35 లకే విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పంపిణీ సరిగ్గా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో దుకాణానికి 220 కిలోల ఉల్లిపాయలు మాత్రమే కేటాయించారు. దీనివల్ల చాలా మంది ప్రజలు ఖాళీ చేతులతో వెనుతిరగాల్సి వస్తోంది. చైన్నెలో ని చూలైమేడు ప్రాంతంలోని కొన్ని అముధం దుకాణాలకు ఇప్పటి వరకు ఉల్లిపాయలు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం మంచి పథకాన్ని తీసుకువచ్చినా అధికారుల నిర్లక్ష్యం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

టీచర్ల అర్హత పరీక్ష ఫలితాల విడుదలపై స్టే తొలగింపు

తిరువొత్తియూరు: ఉపాధ్యాయ అర్హత పరీక్ష పరీక్ష ఫలితాల విడుదలపై విధించిన స్టేను మద్రాసు హైకోర్టు తొలగించడంపై పాట్టాలి మొక్కల్‌ పార్టీ (పిఎంకె) అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రామదాస్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు ఉపాధ్యాయ నియామక బోర్డు (టీఆర్‌బీ) జూలై 4, 5 తేదీల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించిందని తెలిపారు. ఫలితాల విడుదలపై కోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. దీన్ని మద్రాసు హైకో ర్టు తొలగించడం సంతోషకరమని తెలిపారు. దీనివల్ల ఈ పరీక్ష రాసి ప్రస్తుతం విధుల్లో ఉన్న 2,20,464 మంది ఉపాధ్యాయుల మానసిక ఆందోళనకు తెరపడిందని వెల్లడించారు. ప్రస్తుతం స్టే తొలగించినందున ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా 3.28 లక్షల మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం ఉత్తీర్ణత మార్కులను 150 మార్కులకు గాను 52 మార్కులుగా (35 శాతానికి) తగ్గించాలని సూచించారు.

లాడ్జిలో ఉరి వేసుకుని సోదరుల ఆత్మహత్య

అన్నానగర్‌: ఇద్దరు సోదరులు పెరియమేడు ప్రాంతంలోని లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. విరుదునగర్‌ జిల్లాలోని రోసపట్టి పాండియన్‌ నగర్‌కు చెందిన కార్తీక్‌ రాజా(28) గ్రూప్‌ 2 పరీక్ష రాయడానికి 29వ తేదీన తన సోదరుడు వినోద్‌ (21)తో కలిసి చైన్నె వచ్చాడు. పెరియమేడులోని రంగయ్య వీధిలో ఉన్న ఒక ప్రైవేట్‌ లాడ్జిలో గది తీసుకున్నాడు. ఆ రోజు నుంచి గురువారం రాత్రి వరకు ఇద్దరూ బయటకు రాలేదు. గది నుంచి దుర్గంధం వెదజల్లడంతో లాడ్జి ఉద్యోగి సుబ్రమణి పెరియమేడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపు పగులగొట్టి చూడగా కార్తీక్‌ రాజా, వినోద్‌ ఉరివేసుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి పంపారు. విచారణలో మృతులు తండ్రి కుటుంబానికి, తల్లి కుటుంబానికి మధ్య సమస్య ఉన్నట్లు తేలింది. వీరు కొన్ని రోజుల క్రితం వారిద్దరూ తమ తల్లితో కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. ఆ ఘటనలో వారి తల్లి మరణించగా, వీరు ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడైంది. తల్లి మృతితో తీవ్ర మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement