తిరువళ్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణం కోసం తిరువళ్లూరు జిల్లాలో 232 బస్సులను సిద్ధం చేసినట్టు కలెక్టర్ కవిత తెలిపారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రోజూ 232 బస్సులను వేర్వేరు ప్రాంతాలకు నడుపుతున్నామని తెలిపారు. వీటిలో ఇప్పటికే గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విడియల్ ప్రయాణం పథకాన్ని 72 బస్సుల్లో అనుమతిస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన నేపథ్యంలో అన్ని బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయాన్ని కల్పిస్తామన్నారు.


