విరుదునగర్‌లో.. నారీ భేరి | - | Sakshi
Sakshi News home page

విరుదునగర్‌లో.. నారీ భేరి

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

● ఉన్నత పదవులలోనూ మహిళల హవా

సాక్షి, చైన్నె: అభివృద్ధి చెందుతున్న ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాలలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనది. రాజకీయాలు, విద్య, సాహిత్యం తదితర ప్రతి రంగంలోనూ మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. దీనికి తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా ఒక సరికొత్త ఉదాహరణగా నిలిచింది. ఈ జిల్లాలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు సహా ప్రతి ఒక్క ఉన్నత పదవిలోనూ మహిళలే కొనసాగుతుండటం విశేషం. పలు రంగాలలో వెనుకబడి ఉన్న విరుదునగర్‌లో ఈ పరిణామాన్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారు..

మంత్రులుగా మహిళలు:

ఈ జిల్లాలో తొలిసారిగా ఇద్దరు మహిళలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా జగదీశ్వరి ఇందులో ఉన్నారు. ఈ ఇద్దరు తొలి సారిగా అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే తరపున పోటీ చేసిన విజయ్‌ హవాతో విజయ ఢంకా మోగించారు. మంత్రి పదవుల్ని సైతం దక్కించుకుని జిల్లా అభివృద్ధికి కోసం ఉరకలు తీస్తున్నారు. ఇక, జిల్లా కలెక్టర్‌గా శరణ్య , జిల్లా రెవెన్యూ అధికారిగా ఆనంది, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వనతిలు ఉన్నారు.

ఇతర కీలక అధికారులు

జిల్లా రెవెన్యూ అధికారి శశికళ, కలెక్టర్‌ వ్యక్తిగత సహాయకులుగా ఫిర్దౌస్‌ ఫాతిమా (జనరల్‌), పాండియమ్మల్‌ (అకౌంట్స్‌), హంసవేణి (వ్యవసాయం) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి తిలకం, ఆది ద్రావిడ సంక్షేమ అధికారి శాంతి, సాంఘిక భద్రతా ప్రాజెక్ట్‌ అధికారి మోహన, పబ్లిక్‌ వర్క్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా మహేశ్వరి, మలర్విళి సేవలందిస్తున్నారు.

వైద్య, ఇంజనీరింగ్‌, ఇతర శాఖలు

ప్రభుత్వ వైద్య కళాశాల డీన్‌గా అముదారాణి, జిల్లా ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్‌గా యశోదమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారిగా మీనాక్షి, రహదారుల డివిజనల్‌ ఇంజనీర్‌గా పాఖ్యలక్ష్మి కొనసాగుతున్నారు. సాత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌గా జగదీశ్వరి, జిల్లా ఉపాధి అధికారిగా జ్ఞానప్రభ, తమిళ అభివృద్ధి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జ్యోతిలక్ష్మి, సమీకృత బాలల అభివృద్ధి ప్రాజెక్ట్‌ అధికారిగా శీలా వ్యవహరిస్తున్నారు. అలాగే, రెవెన్యూ, పోలీస్‌, న్యాయవ్యవస్థ వంటి సమస్త విభాగాలలోనూ ఉన్నత పదవులను మహిళలే అలంకరించి పరిపాలనా రంగంలో తమ సత్తా చాటుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement