తమిళసినిమా: ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లక్ష్మీ మూవీ మేకర్స్ చాలా గ్యాప్ తర్వాత నిర్మించిన చిత్రం 4 ఇడియట్స్. ఈ సంస్థ నిర్మించిన 27వ చిత్రం ఇది. డాక్టర్ ఎం.శ్రీవాత్సవ్, ఎం.గోకుల్ కృష్ణన్ నిర్మించిన ఈ చిత్రానికి సజో సుందర్ మురుగేశన్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. పుగళ్, ప్రాఖ్య నయన్ , రవి మరియ, కుంకీ అశ్విన్, విన్సెంట్ అశోక్, ఇంద్రన్ ఇళంగోవన్, ట్రిడియన్ తిరుసెల్వన్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. మెడికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సందేశాత్మక కామెడీ ఎంటర్ టైనర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. నలుగురు మిత్రులు తప్పని పరిస్థితుల్లో చిల్లర దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అలా ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి అక్కడ సెక్యూరిటీకి దొరికి పోతారు. ఈ మేరకు వారు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నారు ? అందులోంచి బయట పడ్డారా? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథా చిత్రం 4 ఇడియట్స్. ఒక వైద్యుడు అమాయకులను ట్రాప్ చేసి అవయవాల రాకెట్‌కు ఎలా పాల్పడుతున్నాడు ? అనే ఆసక్తికరమైన అంశాలతో పాటు కొందురు కడుపు నింపుకోవడానికి చేసే దొంగతనాల వల్ల ఇతరులు ఎలాంటి సాధింపులకు గురవుతున్నారు ? అనే అంశాలను తెరపై ఆవిష్కరించిన చిత్రం 4 ఇడియట్స్. ఈ చిత్రానికి సుభాష్ మునిరత్నం సంగీతం, యుకే.సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.
తమిళసినిమా: ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా , సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌లో కాంబోలో ఇదివరకు కాదలన్ తో సహా పలు విజయవంతమైన చిత్రాలు వచ్చినా విషయం తెలిసిందే. సుమారు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న మ్యూజికల్ కథా చిత్రం మూన్ వాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడంతో పాటు 6 పాటలను పాడడం విశేషం ఈ చిత్రానికి సంబంధించిన ప్రభుదేవా , ఏఆర్ రెహమాన్ కలిసి డాన్స్ చేసిన ప్రోమో ఆల్బమ్ ఇటీవల విడుదలైన ప్రేక్షకుల ఆదరణను పొందింది. యోగి బాబు, అంజు వర్గీస్, అర్జున్ అశోక్ ,రెడిన్ కింగ్స్ లీ, మొట్టై రాజేంద్రన్, యూట్యూబర్ సతీష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మనోజ్ ఎన్‌ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బిహైండ్ సంస్థ నిర్మిస్తోంది. కాగా మూన్ వాక్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


