– టీవీకే కార్యకర్తలు ఇద్దరి అరెస్ట్
వేలూరు: కృష్ణగిరి జిల్లా ఊతంగరై సమీపంలోని కరుమండపతికి చెందిన వెంకటేశన్ బుధవారం రాత్రి తిరుపత్తూరు జిల్లా కాకంగరై సమీపంలోని రాజవూరు వద్ద తన స్నేహితురాలితో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు వెంకటేశన్ అతని స్నేహితరాలిని వీడియో తీసి వారిని బెదిరించి బంగారు చైన్‌తో పాటు బ్యాగును తీసుకొని వెంకటేశన్ బైకులో పరారయ్యారు. గురువారం ఉదయం వెంకటేశన్‌కు ఫోన్ చేసి రూ: 50 వేలు ఇవ్వాలని లేకుంటే వారి వీడియోను అసభ్యంగా మార్చి సోషల్ మీడి యాలో పెడుతామని బెదిరించినట్లు తెలుస్తుంది. దీంతో వెంకటేశన్ కందిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటేశన్‌ను బెదిరించి నగలు, బ్యాగు, బైకును దోచుకున్న నిందితులు ఎవరు అనే వాటిపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో నర్సంబట్టికి చెందిని టీవీకే కార్యకర్తలు కుమరన్, అతడి స్నేహితుడు పరియకన్నలంబట్టి గ్రామానికి చెందిన మణిగా గుర్తించి వారిద్దరిని అరెస్ట్ చేసి తిరుపత్తూరు కోర్టులో హాజరు పరిచి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


