నిత్యానంద భద్రతకు వినతి | - | Sakshi
Sakshi News home page

నిత్యానంద భద్రతకు వినతి

Sep 5 2026 1:44 AM | Updated on Sep 5 2026 1:44 AM

సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలోని కై లాస ధ్యాన పీఠం కుంభాభిషేక (ప్రతిష్ఠాపన) మహోత్సవంలో స్వామి నిత్యానంద పాల్గొననున్న నేపథ్యంలో, ఆయనకు తగిన భద్రత కల్పించాలని కై లాష్‌ ఆధ్యాత్మిక బృందం పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగస్వామిని కోరింది. శుక్రవారం ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. 2027లో పుదుచ్చేరిలోని ఎంబళం వద్ద నిత్యానంద కై లాష్‌ ధ్యాన పీఠంలో వైభవంగా కుంభాభిషేక వేడుకలు జరగనున్నాయని వివరించింది. ఈ కార్యక్రమానికి స్వామి నిత్యానంద స్వయంగా హాజరవుతున్నందున, ఈ మేరకు అనుమతులు , ఇతర ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వంతో కలసి పూర్తి చేస్తున్నామని వివరించింది. ఈ సందర్భంగా కై లాసం ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యతను వివరించే కై లాస పుస్తకాన్ని సీఎం రంగస్వామికి బహుకరించింది. అనంతరం పుదుచ్చేరి అసెంబ్లీ ప్రొటెమ్‌ స్పీకర్‌ అన్బళగన్‌, మంత్రి రాజవేలు తదితరులకు ఆహ్వాన పత్రికలను అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement