త్వరంలోనే కేబినెట్‌లో భారీ మార్పులు? | - | Sakshi
Sakshi News home page

త్వరంలోనే కేబినెట్‌లో భారీ మార్పులు?

Sep 5 2026 1:56 AM | Updated on Sep 5 2026 1:56 AM

సచివాలయం

సాక్షి, చైన్నె: శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం తమ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కొన్ని నెలలుగా మంత్రుల పరిపాలనా సామర్థ్యం, పనితీరుపై చేయించిన సర్వేలు, అంతర్గత విచారణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో రాణించని వారికి, వివాదాల్లో చిక్కుకున్న వారికి పదవుల నుంచి ఉద్వాసన పలికి , సమర్థులైన కొత్తవారికి కీలక శాఖలు అప్పగించేందుకు సీఎం విజయ్‌ ప్రణాళికలు రచిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో మరింత వేగం పెంచేందుకు పరిశ్రమల శాఖనుఅధవ్‌ అర్జునకు అప్పగించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే, పాఠశాల విద్యా శాఖను అనుభవజ్ఞుడైన సెంగోట్టయాన్‌కు అప్పగించవచ్చని భావిస్తున్నారు.మంత్రి రాజ్‌ మోహన్‌కు ఇతర ముఖ్య బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే, పరిశ్రమల మంత్రి కీర్తనకు మానవ వనరుల అభివృద్ధిశౠఖను అప్పగించే యోచనతో పాటుగా మరి కొందరి స్థానాలు కదిలించే దిశగా టీవీకే నాయకత్వం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రులు విశ్వనాథన్‌, రాజేష్‌కుమార్‌ శాఖల్లో సైతం మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement