న్యూస్‌రీల్
సాక్షి, చైన్నె: సీఎం విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తరచూ ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లలో తనిఖీలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం చైన్నె రెడ్‌హిల్స్ సమీపంలోని పుళల్ సెంట్రల్ జైలును సందర్శించారు. ఖైదీల పరిస్థితి, వారికి అందుతున్న సౌకర్యాలపై సమీక్షించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహార నాణ్యత, వంటగది నిర్వహణ, వైద్య సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గంటపాటు జైలు ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం సమీపంలోని ఎం 3 పోలీస్ స్టేషన్‌ను విజిట్ చేశారు. రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లను తనిఖీ చేశారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు.
గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మీట్‌లో డీఎంకే నిరసన
సాక్షి,చైన్నె : గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో శుక్రవారం నిధుల కేటాయింపుపై డీఎంకే తీవ్ర నిరసన తెలిపింది. డీఎంకే మేయర్ ప్రియ అధ్యక్షతన ఉదయం రిప్పన్ బిల్డింగ్‌లో సమావేశం జరిగింది. కార్పొరేషన్‌కు టీవీకే ప్రభుత్వం తగినంత నిధులు కేటాయించడం లేదని డీఎంకే కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నల్ల దుస్తు లు ధరించి నిరసన తెలిపారు. తమిళనాడులో ప్రభుత్వం మారిన తర్వాత చైన్నె కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆరోపించారు. ఈ ఏడాది చైన్నెలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షపునీటి పారుదల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిధుల కొరత, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని స్పష్టం చేశారు.
స్టాలిన్, డీఎంకే ఐటీ వింగ్‌కు హైకోర్టు నోటీసు!
– ఆధవ్ పరువు నష్టం దావా కేసు
సాక్షి, చైన్నె : తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జునపై అసత్య ప్రచారాలు చేశారనే ఆరోపణలతో దాఖ లైన పరువు నష్టం దావా కేసులో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, ఆ పార్టీ ఐటీ వింగ్ సెప్టెంబర్ 15వ తేదీలోగా సమాధానమివ్వాలని హైకోర్టు ఆదేశించింది. రూ.258 కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితుడైన జాన్ బ్రిట్టో, మంత్రి ఆధవ్ అర్జునకు బంధువంటూ జూన్ 8న డీఎంకే ఐటీ వింగ్ తన అధికారిక ఎక్స్’(ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని మంత్రి ఆధవ్ అర్జున మండిపడ్డారు. ఎం.కె.స్టాలిన్, డీఎంకే ఐటీ వింగ్‌పై రూ.కోటికి పరువు నష్టం దావాను మద్రా సు హైకోర్టులో దాఖలు చేశారు. ఈ అసత్య ప్రచారానికి గాను ఎం.కె.స్టాలిన్, డీఎంకే ఐటీ వింగ్ ప్రముఖ తమిళ, ఆంగ్ల దినపత్రికలు, టీవీ ఛానెళ్ల లో షరతులు లేని క్షమాపణలు చెప్పాలని పిటిషన్ లో కోరారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.గోవిందరాజన్ తిలకవతి బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ డ్రగ్స్ కేసు నిందితుడు జాన్ బ్రిట్టోకు, మంత్రి ఆధవ్ అర్జునకు సంబంధం లేదని తెలిపారు. మంత్రి బంధువైన పి.జాన్‌బ్రిట్టో పేరు లోని పోలికను ఆసరాగా చేసుకుని డీఎంకే రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రచారం చేసిందని వివరించారు. ఈ వాదనలను నమోదు చేసుకున్న జడ్జి కేసు విచారణను వాయిదా వేస్తూ ఎం.కె.స్టాలిన్, డీఎంకే ఐటీ వింగ్ సెప్టెంబర్ 15 నాటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఆధవ్ అర్జున


