తిరువళ్లూరు: వేళమ్మాల్ విద్యాశ్రమ్ పాఠశాలలో ఇన్‌విక్టస్ – 2026 పేరిట నిర్వహించిన వేర్వేరు క్రీడా పోటీల్లో విజేతలకు ఎమ్మేల్యేలు బహుమతులను ప్రదానం చేసి అభినందించారు. తిరువళ్లూరు జిల్లా సెవ్వాపేటలో వేళమ్మాల్ విద్యాశ్రమ్ పాఠశాల వుంది. ఈ పాఠశాలలో ఏటా విద్యార్దులకు క్రీడా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రధానం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది క్రిడాపోటీలను ఇన్‌విక్టస్–2026 పేరిట తిరువళ్లూరులోని ఎస్పీ మైదానంలో నిర్వహించారు. పోటీలకు సుమారు వెయ్యి మంది విద్యార్దులు పాల్గొన్నారు. పోటీలను పాఠశాల కరస్పాండెంట్ సుడలైముత్తుపాండ్యన్, ప్రిన్సిపల్ సతీష్‌సత్యమూర్తి తదితరులు హాజరై ప్రారంభించారు. పోటీల్లో పరుగుపందెం, వాల్‌బాల్, త్రోబాల్, లాంగ్‌జంప్‌తో పాటు పలు పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజేతలకు పూందమల్లి ఎమ్మెల్యే కుట్టి ప్రకాశం, ఆవడి ఎమ్మేల్యే రమేష్‌కుమార్ తదితరులు బహుమతులు సర్టిఫికెట్‌లు, కప్‌లను అందజేశారు. పాఠశాలలోని విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలని సూచించారు. పోటీల్లో ఓడినా అందుకు గల కారణాలను లోపాలను తెలుసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్దులు పాల్గొన్నారు.


