సాక్షి, చైన్నె : జితో చైన్నె చాప్టర్, కాసా గ్రాండ్ సంయు క్త ఆధ్వర్యంలో పగారియా జేబీఎన్ బిజినెస్ కాన్క్లేవ్ 2.0ని చైన్నె రాయపేటలోని వై ఎం.సి ఏ మైదానంలో శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరు గు ఈ సదస్సును గౌరవ అతిథులుగా విచ్చేసిన నీనా రెడ్డి, ఏవీఎం కె.షణ్ముగం, శరణ్య జైకుమార్ తదితర ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు తమ స్ఫూర్తిదాయక ప్రసంగాలలో వ్యవస్థాపకత, ఆవిష్కరణ, ఆర్థిక వృద్ధిని నడిపించడంలో వ్యాపార వర్గాల పాత్ర ప్రా ముఖ్యతను వివరించారు. దేశం నగరం నలుమూలల నుండి పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులు, ప్ర దర్శనకారులు, నిపుణులు, సందర్శకుల నుండి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. ఈ ప్రదర్శనలో ఆ భరణాలు, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ, ఫర్నిచర్, దుస్తులు, టెక్నాలజీ, లైటింగ్, భవన నిర్మాణ సామగ్రి, వృత్తిపరమైన సేవలతో సహా విభి న్న రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో జితో చైర్మన్ రాజేష్ చందన్, వైస్‌చైర్మన్ శ్రేజస్ కోఠారి, చీఫ్ సెక్రట రీ ఆకాష్ కుమార్ ఎం.జైన్, సెక్రటరీ అంకిత్ సిరోయా తదితరులు పాల్గొన్నారు.


