సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉండేనా..? ఊడేనా..? అన్న చర్చ తెర మీదకు వచ్చింది. డీఎంకే తమకు 25సీట్లు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తమిళనాడు ఇన్‌చార్జ్ గిరిశ్‌చోదన్కర వ్యాఖ్యలు చేసింది. ఇది కాస్త డీఎంకే కూటమిలోచర్చకు దారి తీసింది. అదే సమయంలో డీఎంకే కమిటీతో వీసీకే నేత తిరుమావలవన్ సోమవారం సమావేశమయ్యారు. వివరాలు.. ఆది నుంచి డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంటూ వచ్చినా, తాజాగా చేస్తున్న మారం చర్చలకు దారి తీసింది. అధికారంలో వాటా, అధిక సీట్ల నినాదంతో గత కొన్ని నెలలుగా టీఎన్‌సీసీ నేతలు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలపై డీఎంకే అధిష్టానం గుర్రుగానే ఉంది. ఆలస్యంగానే కాంగ్రెస్‌తో డీఎంకే కమిటీ చర్చలు సైతం జరిపింది. తమకు 39 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతుండటంతో డీఎంకే కమిటీ గతవారం చర్చల సందర్భంగా మౌనం వహించింది. ఈ వ్యవహారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ దృస్టికి సైతం తీసుకెళ్లారు. కాంగ్రెస్ చేస్తున్న బెట్టును తీవ్రంగానే స్టాలిన్ సైతం పరిగణించి,చివరి క్షణంలో చూసుకుంద్దామన్న సూచనను కమిటీకి ఇచ్చినట్లు సమాచారం. ఈపరిస్థితులలో డీఎంకే కాంగ్రెస్‌కు 25 సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని టీఎన్‌సీసీ ఇన్‌చార్జ్ గిరిశ్ చోదన్కర్ దృష్టికి మీడియా తీసుకెళ్లగా, ఆ సీట్లను తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. తాము జాబితా ఇచ్చామని, ఆ సీట్లు ఇవ్వాల్సిందేని డిమాండ్ చేశారు. అదే సమయంలో టీవీకే విజయ్ వెన్నంటి యువ సమూహం ఉందన్న వ్యాఖ్యలను ఆయన చేయడం చర్చకు దారి తీసింది. డీఎంకేతో సీట్ల వివాదం తలెత్తిన పక్షంలో తాము విజయ్‌తో దోస్తీకి వె నుకాడబోమన్నట్టుగా గిరిశ్ చోదన్కర్ ఈ సంకేతాన్ని ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆయన వ్యాఖ్యలను డీఎంకే తీవ్రంగానే పరిగణించి, పొమ్మని పొగ పెట్టే దిశగా కొత్త వ్యూహాలకు సన్నద్దం అవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అవసరం అయితే, కాంగ్రెస్‌ను పక్కన పెట్టేందుకు వెనుకాడబోమన్నట్టుగా డీఎంకే కమిటీ దూకుడుగా ప్రవర్తించేందుకు సన్నద్దం అవుతున్నట్టు సమాచారం. ఇక, ఆదివారం స్టాలిన్ బర్త్‌డే సందర్భంగా ఏఐసీసీ నేత రాహుల్ చేసిన ట్వీట్ సైతం తాజాగా చర్చకు బలాన్ని చేకూర్చాయి. ప్రతి సంవత్సరం సోద రుడు స్టాలిన్ అని సంభోధించే రాహుల్, తాజాగా ఎంకే స్టాలిన్ అని సంబోధించి ఉండడం బట్టి చూస్తే, డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగేనా..? లేదా బయటకు వెల్లేనా..? అని చర్చించుకునే వాళ్లు కూడా పెరిగారు. ఇదిలా ఉండగా తాజా చర్చల గురించి మంత్రి అన్బిల్ మహేశ్ ఓమీడియాతోమాట్లాడుతూ, రాహుల్, స్టాలిన్ ఇరువురు ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడుకుంటే చాలు అని,అన్ని సమస్యలుపరిష్క రించబడుతాయని, ఎవరెన్ని మాట్లాడుకున్న ఆతర్వా త వృథా ప్రయాసేనని వ్యాఖ్యానించడం గమనార్హం.
డీఎంకే కమిటీతో వీసీకే సమావేశం
డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు నేతృత్వంలోని కమిటీ వీసీకే నేత తిరుమావళవన్ బృందం సోమవారం సమావేశ మైంది.గతంలో ఇచ్చినట్టుగా ఆరుతో ముగించకుండా తమకు పది సీట్లు ఇవ్వాలని వీసీకే విజ్ఞప్తి చేసినట్టు తెలిసిందే. అయితే, గతంలో ఇచ్చిన ఆరులోనూ ఒక సీటును తగ్గించుకోవాలని డీఎంకే కమిటీ సూచించినట్టు సమాచారం.అదే సమయంలో పుదుచ్చేరిలోనూ తమకు మూడు సీట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ను వీసీకే ఉంచడం గమనార్హం.ఈచర్చల అనంతరం తిరుమావళవన్ మీడియాతోమాట్లాడుతూ,సీట్ల కోసం డీఎంకే వద్ద భేరం పెట్టే పార్టీ తమది కాదన్నారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలని, తమిళనాడు పరిరక్షించ బడాలి, తమ హక్కులు సాధించుకోవాలి అని వివరించారు. తమిళనాడు వరకు సంతృప్తికరంగానే చర్చ జరిగిందని, పుదుచ్చేరిలోనూ తమకు 3 సీట్లు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు.


