మళ్లీ మోదీ రాక | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మోదీ రాక

Mar 3 2026 8:11 AM | Updated on Mar 3 2026 8:11 AM

న్యూస్‌రీల్‌

సాక్షి, చైన్నె :ీపఎం నరేంద్రమోదీ మరో మారు తమిళనాడుకు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై బీజేపీ వర్గాలు దృష్టి పెట్టాయి. 7వ తేదీన వేలూరులో, 11న తిరుచ్చిలో బహిరంగ సభకు సన్నాహాలు చేపట్టారు. గత నెల మదురాంతకంలో జరిగిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అన్నాడీఎంకే, బీజేపీ కూట మిని పరిచయం చేశారు. ఆ తదుపరి ఆదివారం మదురైలోఅధికారిక కార్యక్రమంతో పాటుగా బీజేపీ బహిరంగసభలో పాల్గొన్నారు. తదుపరి వరసుగా ఆయన పర్యటనలకు బీజేపీ వర్గాలు కసరత్తుల చేపట్టాయి. ఆ మేరకు వేలూరు, తిరుచ్చిలలో బహిరంగ సభలకు సన్నద్ధమయ్యారు. మోదీ తదుపరి అమిత్‌ షా నేతృత్వంలో బహిరంగ సభలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నగారా మోగగానే కేంద్ర మంత్రుల, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల ద్వారా ఆయా నియోజకవర్గాలలో సభలకు సైతం కసరత్తులు చేపట్టారు.

నీటికుంటలో మునిగి

ఇద్దరు బాలురు దుర్మరణం

అన్నానగర్‌: తిరుప్పూర్‌ జిల్లా అవినాశి సమీపంలోని నంబియంబలైయం ప్రాంతానికి చెందిన వెల్లియంగిరి. ఇతని భార్య ఉష. వీరి కుమారుడు ధరణిష్‌ (12). ఇతను ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన పెరుమాళ్‌ వలర్మతి దంపతుల కుమారుడు హరికరణ్‌ (8) పంచాయతీ యూనియన్‌ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఇద్దరు బాలురు అక్కడ వీధుల్లో ఆడుకోవడానికి వెళ్లారు. తర్వాత బాలురు ఇంటికి తిరిగి రాలేదు. దిగ్బ్రాంతి చెందిన తల్లిదండ్రులు వివిధ ప్రాంతాల్లో బాలుర కోసం వెతికారు. ఇంతలో సోమవారం ఉదయం ఆ దారిలో వెళ్తున్న వ్యక్తులు అనంతగిరిలోని చెరువులో బాలుర బూట్లు తేలుతుండటం చూసి బాలుర తల్లిదండ్రులకు, అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా దాదాపు 7 అడుగుల లోతున్న చెరువు నీటితో నిండిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ధరణిష్‌, హరికరణ్‌ మృతదేహాలను వెలికి తీశారు.

ఘనంగా ఉమెన్‌ అచీవర్స్‌ అవార్డుల ప్రదానం

సాక్షి, చైన్నె : ఫిక్కీ మహిళా విభాగంనేతృత్వంలో 2025–26 సంవత్సరానికి గాను ఉమెన్‌ అచీవర్స్‌ అవార్డులను ప్రదానం చేశారు. ఐటీసీ గ్రాండ్‌ చోళాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విభిన్న రంగాలలో అత్యుత్తమ సేవలను అందించిన మహిళలను ఘనంగా సత్కరించారు. నాయకత్వం, స్థితి స్థాపకత, పరివర్తన ప్రభావం ఆధారంగా అర్హులైనవ ఆరిని ఎంపి చేశారు. ఫిక్కీ మహిళా విభాగం చైర్‌ పర్సన్‌ నియాతి ఏ మెహతా, జర్నలిస్టు పాల్కి శర్మ హాజరయ్యారు. అవార్డులను అర్హులైన వారికి అందజేసి సత్కరించారు. ప్రస్తుకు చిల్డ్రన్స్‌ స్పెషలిస్టు డాక్టర్‌ సత్య జగన్నాథన్‌, ముక్తి ఎస్‌ఎం దాదాఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు మీనా దాధాకు జీవిత సాఫల్యపురస్కారం, సత్య స్పెషల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ చిత్రా షాకు వ్యక్తిగత అవార్డు, వీ – ఎక్స్‌ల్‌ ఎడ్యుకేషన్‌ వసుధా ప్రకాష్‌కు సామాజిక వ్యవసాపక అవార్డు,బ్రైట్‌ కార్పొరేట్‌సొల్యూషన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ జయ భారతి కారుమూరి కి ప్రొఫెషనల్‌ ఎక్సలెన్స్‌, అంకుల్‌ సామ్‌ కిచెన్‌ గునిత్‌ సింగ్లాకు ఉత్తమ వ్యవస్థాపక అవార్డు, ఏఏఐ సొల్యూషన్స్‌ ఆంచల్‌ కేజ్రీవాల్‌కు ఫ్యూచర్‌ వ్యవస్థాపకుడు అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డులకు అర్హులైన వారిని ఫిక్కీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు ఉషా కృష్‌న, ట్విన్‌ ఇట్‌ సహ వ్యవస్థాపకురాలు రాజీవ్‌ మెచేరి, గ్లోబల్‌ వెల్‌ ఏపీ ఆఫ్‌ ది ఇయర్‌ దీపా సథి రామ్‌లతో కూడిన జ్యూరీ ప్యానెల్‌ ఎంపిక చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement