క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 3 2026 8:11 AM | Updated on Mar 3 2026 8:11 AM

● రూ. కోటి విలువైన వస్తువులు దగ్ధం

సిలంబంలో రికార్డు

సృష్టించిన బాలుడు

అన్నానగర్‌: చైన్నె తాంబరం సమీపంలోని పాత పెరుంగళత్తూర్‌ ప్రాంతంలో సోమవారం తమిళులు ‘సిలంబం’ పేరుతో నోబల్‌ వరల్డ్‌ రికార్డు కార్యక్రమం జరిగింది. ఇందులో తాంబరంకు చెందిన 4 ఏళ్ల బాలుడు అరన్‌ తిగల్‌ విరాజ్‌ 1 గంట 7 నిమిషాల పాటూ నిరంతరాయంగా సిలంబం చుట్టూ ప్రదక్షిణ చెసి నోబల్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు. తాంబరం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డీన్‌ డాక్డర్‌ సి. పళనివేల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరై, ఈ ఘనత సాధించిన బాలుడికి సర్టిఫికెట్‌, బహుమతిని అందజేశారు.

గోదాములో

భారీ అగ్ని ప్రమాదం

అన్నానగర్‌: తిరువెర్కాడ్‌ సమీపంలోని ఓ గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి, బాదం, జీడిపప్పు సహా రూ. కోటి విలువైన వస్తువులు కాలిపోయాయి. చైన్నెకి చెందిన సునీల్‌ ఇతను చైన్నె అంతటా అధిక నాణ్యత గల బాదం, జీడిపప్పు, ద్రాక్ష, ఖర్జూరాలు అమ్మే దుకాణం నడుపుతున్నాడు. తిరువెర్కాడ్‌ సమీపంలో ఉన్న వేలప్పన్‌ చావడిలో అతనికి సొంత గోడౌన్‌ ఉంది. ఈ గిడ్డంగిలో బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి అధిక విలువైన వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసి, రోజూ చైన్నెలోని తన దుకాణాలకు పంపేవారు. ఇక్కడ 50 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ గిడ్డంగిలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా గిడ్డంగి అంతటా వ్యాపించి కాలిపోయాయి. దీని గురించి సమాచారం అందుకున్న పూందమల్లి, అంబత్తూరు, మధురవాయల్‌, ఆవడి, ఇతర ప్రాంతాల నుండి అగ్నిమాపక సిబ్బంది గిడ్డంగిలో మంటలను ఆర్పడానికి వచ్చారు. చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.కోటి విలువైన వస్తువులు మంటల్లో కాలిపోయాయి. ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందా..? అనే కోణంలో తిరువెర్కాడ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చైన్నెలో స్మార్ట్‌బైక్‌లు

కొరుక్కుపేట: చైన్నెలో నిలిపివేసిన స్మార్ట్‌ బైక్‌(సైకిల్‌) సర్వీస్‌ను త్వరలో తిరిగి ప్రారంభిస్తామని చైన్నె మెట్రోపాలిటన్‌ మున్సిపాలిటీ ప్రకటించింది. చైన్నెలో కరోనావైరస్‌ మహమ్మారి వ్యాప్తి చెందడంతో అనేక చోట్ల 1000 కి పైగా సైకిళ్లు నిలిపివేయబడిన స్మార్ట్‌ బైక్‌ సర్వీస్‌ను తిరిగి ప్రారంభించడానికి చైన్నె కార్పొరేషన్‌ ఒక ప్రైవేట్‌ కంపెనీతో చర్చలు జరుపుతోందని కార్పొరేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. చైన్నెలో నిలిపివేయబడిన స్మార్ట్‌బైక్‌ సర్వీస్‌ను తిరిగి ప్రారంభించడానికి ఒక ప్రైవేట్‌ కంపెనీతో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయన్నారు. మొదట 30 కీలక ప్రదేశాలలో ప్రవేశపెడతామని, తరువాత ప్రజల మద్దతును బట్టి ఈ సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం డీపీఎఫ్‌ఓ ఒప్పందం హైదరాబాద్‌కు చెందిన కంపెనీ తన ఆదాయంలో 30 శాతం కార్పొరేషన్‌తో పంచుకుంటుందన్నారు. ఇది నెలవారీ పాస్‌కు రూ.249 మూడు నెలల పాస్‌కు రూ.699 మొదలైన అనేక అవకాశాలను కూడా అందించిందన్నారు. ఇంకా యూపీఐ డిజిటల్‌ చెల్లింపు అందుబాటులో ఉంటుందని, స్టేషన్‌లో 25 నుంచి 30 బైక్‌లు అందుబాటులో ఉంటాయని కూడా ఆయన అన్నారు.

చైన్నెలో వైభవంగా క్విజ్‌బైట్స్‌

సాక్షి, చైన్నె: వంటల ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన జ్ఞాన వేదిక క్విజ్‌బైట్స్‌ 4.ఓ చైన్నెలో ఘనంగా జరిగింది. జీఆర్‌టీ గ్రాండ్‌లో జరిగిన ఈ పోటీలలో కలినరీ అకాడమీ ఆఫ్‌ హైదరాబాద్‌ జట్టు విజేతగా నిలిచింది. ఇస్పహానీ సెంటర్‌ వరుసగా నాలుగో సంవత్సరం నిర్వహించిన ఈ పాకశాస్త్ర క్విజ్‌ పోటీల్లో దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి దాదాపు 100 మంది వంట నిపుణులు (చెఫ్‌లు), 50కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఈ ఏడాది పోటీలను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు బజర్‌ రౌండ్‌లు, హై–స్పీడ్‌ సెషన్‌లను ఏర్పాటు చేశారు. ఇవి చెఫ్‌ల నైపుణ్యాన్ని, సమయస్ఫూర్తిని, జట్టు కృషిని పరీక్షించాయి. ఈ కార్యక్రమానికి సౌత్‌ ఇండియన్‌ కలినరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు చెఫ్‌ దామోదరన్‌, జనరల్‌ సెక్రటరీ చెఫ్‌ శీతలామ్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెఫ్‌ దామోదరన్‌ మాట్లాడుతూ.. క్విజ్‌బైట్స్‌ 4.ఓ దక్షిణ భారత పాక సమాజంలోని అసాధారణ ప్రతిభను ప్రదర్శించిందన్నారు.. చెఫ్‌లు తమ జ్ఞానాన్ని, సృజనాత్మకతను చాటుకోవడం చూడడం స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఇది కేవలం పోటీ మాత్రమే కాదు, చెఫ్‌లందరినీ ఒకే వేదికపైకి తెచ్చే గొప్ప అవకాశమని కొనియాడారు. ఇస్పహానీ సెంటర్‌ డైరెక్టర్‌ కేసన్‌ మాట్లాడుతూ ఈ వేదిక ఏడాదికేడాది బలపడుతోందన్నారు. దక్షిణాది వంటల వైభవాన్ని కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement