మెడికల్‌ ఎమర్జెన్సీలో సరికొత్త అధ్యాయం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ ఎమర్జెన్సీలో సరికొత్త అధ్యాయం

Mar 3 2026 8:11 AM | Updated on Mar 3 2026 8:11 AM

● రాష్ట్రవ్యాప్తంగా జీఐ బ్లీడ్‌ సెంటర్లు

సాక్షి, చైన్నె : మెడికల్‌ ఎమర్జెన్సీలోసరికొత్త అధ్యాయం దిశగా కావేరి గ్రూప్‌ఆఫ్‌ ఆస్పత్రి ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా ‘జీఐ బ్లీడ్‌ సెంటర్ల’ను ఏర్పాటు చేసింది. జీర్ణవ్యవస్థలో సంభవించే అంతర్గత రక్తస్రావం అనేది అత్యంత ప్రమాదకరమైన వైద్య అత్యవసర పరిస్థితి అని, ఇలాంటి కేసుల్లో రోగి ప్రాణాలను రక్షించడానికి తక్షణ , నిపుణులైన చికిత్స అందించే లక్ష్యంతో ఈ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కావేరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైజెస్టివ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి. బసుమణి ప్రకటించారు. చైన్నెలో జరిగిన ఈ సెంటర్లప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ. జిఐ రక్తస్రావం జరిగినప్పుడు ప్రతి నిమిషం విలువైనదేని, ముందస్తు అంచనా, ఖచ్చితమైన రోగ నిర్ధారణ మాత్రమే రోగిని కాపాడగలవు అని వివరించారు. తమ కేంద్రాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్ని రకాల సౌకార్యలతో వేగవంతమైన సంరక్షణను అందిస్తున్నామని తెలిపారు. జీర్ణవ్యవస్థలో రక్తస్రావం అనేది అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు లేదా కాలేయ వ్యాధుల వల్ల సంభవించవచ్చు అని పేర్కొంటూ, దీనిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాపాయం తప్పదన్నారు. ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి ఈ కేంద్రాలు 24 గంటల పాటుగా అందుబాటులో ఉంటాయన్నారు. కావేరి గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సహ వ్యవస్థాపకుడు డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ మాట్లాడుతూ.. ‘తమిళనాడు , కర్ణాటకలోని 12 యూనిట్ల ద్వారా ఈ అధునాతన వైద్య సేవలను సామాన్యులకు దరిచేరుస్తున్నామన్నారు.. అత్యవసర పరిస్థితుల్లో నాణ్యమైన చికిత్స అందించడమే తమ నిరంతర లక్ష్యంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement