విదార్ధ్‌ హీరోగా తొడక్కం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

విదార్ధ్‌ హీరోగా తొడక్కం ప్రారంభం

Mar 3 2026 8:11 AM | Updated on Mar 3 2026 8:11 AM

తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అందుకున్న నటుడు విదార్ధ్‌. ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తొడక్కం. నటి చాంధిని తమిళరసన్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్తర్‌ అనిల్‌, శ్రియ రుక్మిణి, గోపరాజ్‌, రమణ,అక్షత,కేశవ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సన్‌ ఆఫ్‌ వైండ్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తులసి రామన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ఛాయాగ్రహకుడిగా, దర్శకుడిగా పలు షార్ట్‌ ఫిలింస్‌ రూపొందించారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ సోమవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కాగా ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇది వైవిధ్యభరిత కుటుంబ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా కుటుంబ అనుబంధాలు, భావోద్రేకాలతో, సహజత్వానికి దగ్గరగా ఉంటుందన్నారు. మానవతా విలువలను ఆవిష్కరించే ఈ తొడక్కం ప్రేక్షకులకు సరి కొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని షూటింగ్‌ను పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి భరత్‌ శంకర్‌ సంగీతాన్ని, శ్రీకాంత్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement