సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న యాత్రికులు | - | Sakshi
Sakshi News home page

సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న యాత్రికులు

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

సురక్

సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న యాత్రికులు

– భారతకోస్ట్‌ గార్డు పటిష్ట భద్రత

కొరుక్కుపేట: కచ్చదీవు ద్వీపంలోని ప్రసిద్ధ సెయింట్‌ ఆంటోనీ చర్చిలో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో వార్షిక ఉత్సవాలను నిర్వహించింది. ఈ ప్రత్యేకమైన ఉత్సవం భారత్‌, శ్రీలంక రెండింటికీ చెందిన మత్స్యకారులకు మతపరమైన పవిత్రతను కలిగి ఉన్నారు. ఈక్రమంలో తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం 3,741 మంది యాత్రికులు ఫిబ్రవరి 27న కచ్చదీవు ద్వీపానికి బయలుదేరారు. పెద్దసంఖ్యలో యాత్రిక పడవులు రామేశ్వరం నుంచి అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ ఐఎంబిఎల్‌ వరకు భారత కోస్ట్‌ గార్డు ఎస్కార్ట్‌ చేసి సందర్శనకు వీలుగా శ్రీలంక నావికాదళానికి అప్పగించింది. కచ్చదీవు ద్వీపంలో రాత్రి పూట బస చేసిన తర్వాత యాత్రికులు సురక్షితంగా మాతృభూమికి తిరిగి వచ్చారు. భద్రతను నిర్ధారించడానికి ఫిషింగ్‌ బోట్ల కాన్వాయ్‌ భారత్‌ కోస్ట్‌గార్డు ఉపరిత, వాయు విభాగాల ఎస్కార్ట్‌ ప్రత్యేక నిఘా ఉంచినట్టు అధికారులు వెల్లడించారు.

చేపల పడవల్లోకి

పర్యటకులను ఎక్కిస్తే చర్యలు

– పోలీసుల హెచ్చరిక

తిరువొత్తియూరు: చేపలపట్టే పడవల్లో పర్యాటకులను ఎక్కించుకుని సముద్రంలోకి తీసుకుని వెళితే కఠిన చర్యలు తప్పవని పుదుచ్చేరి పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు కోస్తా తీర పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ త్యాగరాజన్‌ ఆదివారం మత్స్యకార గ్రామాలకు ఓ సర్క్యులర్‌ను పంపించారు. అందులో మార్చి 3వ తేదీన మాసి మఖం ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మత్స్యకారులందరి భద్రత, ప్రజలు, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి. పుదుచ్చేరిలోని అన్ని తీరప్రాంత మత్స్యకార గ్రామల మత్స్యకార పడవల యజమానులు వారి చేపల పడవల్లో ప్రజలు, పర్యాటకులను సముద్రంలోకి ఎక్కించకూడదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సర్టిఫికెట్లకు ఆదాయ

పరిమితి నెలకు రూ. 8 వేలు

సాక్షి, చైన్నె: నిరాశ్రయులైన వితంతువులకు నెల వారీ ఆదాయ పరిమితి రూ. 8 వేలకు పెంచారు. తమిళనాడు ప్రభుత్వం నిరుపేద వితంతువు సర్టిఫికెట్‌ పొందేందుకు నెలవారీ ఆదాయ పరిమితి ఇది వరకు రూ. 4 వేలుగా ఉండేది. తాజాగా దీనిని రూ. 8 వేలకు పెంచారు. ఈ విషయంలో, తమిళనాడు ప్రభుత్వ మానవ వనరుల నిర్వహణ విభాగం ప్రిన్సిపల్‌ కార్యదర్శి సమయ మూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడులో వితంతువు సర్టిఫికెట్‌ పొందేందుకు నెలవారీ ఆదాయ పరిమితి 1993 సంవత్సరంలో రూ. 1,000. తరువాత, 2006లో రూ. 4,000కి పెంచారని పేర్కొన్నారు. ప్రస్తుత ధరలు, జీవన వ్యయం పెరుగుదల పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం 20 సంవత్సరాల తర్వాత ఈ పరిమితిని పెంచాలని నిర్ణయించిందన్నారు. దీని ప్రకారం, కుటుంబ పెన్షన్‌, వ్యక్తిగత ఆదాయంతో సహా అన్ని వనరుల నుండి నెలవారీ ఆదాయం రూ. 8,000 మించకుండా ఉండాలని సూచించారు. ఇందులో వితంతు మహిళలు మాత్రమే ఉంటారని, విడాకులు తీసుకున్న వారికి అవకాశం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు ఉన్న 30 శాతం రిజర్వేషన్‌లలో 30 శాతం రిజర్వేషన్లలో పది శాతం నిరుపేద వితంతు మహిళలకు కేటాయించబడుతాయని ప్రకటించారు.

మాతృగూటికి నటరాజన్‌

సాక్షి, హచైన్నె : మాజీ మంత్రి వెల్ల మండినటరాజన్‌ మళ్లీ అన్నాడీఎంకేలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సమక్షంలో మాతృగూటికి వచ్చేశారు. తిరుచ్చి అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న వెల్లమండి నటరాజన్‌ అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం వైపుగా తొలుత కదిలారు. ఆ తర్వాతి పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉంటూవచ్చారు. తాజాగా మళ్లీ తనను మాతృగూటిలోకి చేర్చుకునే విధంగా రాయబారం నడిపారు. పళణి స్వామి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అన్నాడీఎంకేలోకి మళ్లీ వచ్చేశారు.

సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న యాత్రికులు 1
1/2

సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న యాత్రికులు

సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న యాత్రికులు 2
2/2

సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న యాత్రికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement