శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో ధనుష్‌? | - | Sakshi
Sakshi News home page

శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో ధనుష్‌?

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

శంకర్

శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో ధనుష్‌?

తమిళసినిమా: తమిళ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్‌ ఒకరు. బ్రహ్మాండానికి మారుపేరుగా ఈయన చిత్రాలు ఉంటాయి. అలా ముదల్వన్‌, జెంటిల్‌మెన్‌, ఇండియన్‌, శివాజీ, ఎందరన్‌ చిత్రాలు శంకర్‌ దర్శకత్వం ప్రతిభకు చిహ్నాలు. ఎవరికై నా జయాపజయాలు సహజం. అలా శంకర్‌ కూడా ఇటీవల ఇండియన్‌–2, తెలుగు గేమ్‌ చేంజర్‌ చిత్రాలు నిరాశపరచాయి. ఇండియన్‌–3 చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్‌ తన తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈసారి భారీ చారిత్రాత్మక కథా చిత్రాన్ని చేతపట్టారు. వేల్పారి అనే నవలను చిత్రంగా మలచనున్నారు. ఇది ఈయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ లభించిందన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని శంకర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. కచ్చితంగా వేల్పారి చిత్రాన్ని సక్సెస్‌ చేసి తన పూర్వవైవభాన్ని చాటుకోవాలని ఆయన భావిస్తున్నారని తెలిసింది. ఇకపోతే ఈ క్రేజీ చిత్రంలో హీరో ఎవరు నటించనున్నారన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సూర్య, విక్రమ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ధనుష్‌ పేరు వినిపిస్తోంది. ఈయనతో చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదే వాస్తవ రూపం దాల్చితే శంకర్‌, ధనుష్‌ కాంబోలో తెరకెక్కే చిత్రం అవుతుంది. అంతేకాకుండా ధనుష్‌ నటించే తొలి చారిత్రక కథా చిత్రం కూడా ఇదే అవుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే వరకూ ఇలాంటి ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ ఉండదు.

శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో ధనుష్‌?1
1/1

శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో ధనుష్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement