పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గ్రీన్ మారథాన్
సాక్షి, చైన్నె: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, ఆరోగ్యకరమైన రేపటి కోసం నినాదంతో ఎస్‌బీఐ గ్రీన్ మారథాన్ సీజన్ –6 ఆదివారం చైన్నెలో కోలాహలంగా జరిగింది. దేశంలోని ప్రముఖ నగరాలైన లక్నో, విశాఖపట్నం, బెంగళూరు మీదుగా సాగిన ఈ పర్యావరణ ఉద్యమం తాజాగా చైన్నెలోని ఐకానిక్ ఈస్ట్ కోస్ట్ రోడ్డు పై అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజామున సముద్రపు చల్లని గాలుల మధ్య, ఉత్తండి వద్ద ప్రారంభమైన ఈ మారథాన్ ఫిట్‌నెస్‌కు, పర్యావరణ పరిరక్షణకు వేదికై ంది. శ్రీపరుగు కోసం ఒక పచ్చని భారతదేశం్ఙ అనే నినాదంతో జరిగిన ఈ వేడుకలో చైన్నె నగరవాసులు భారీ సంఖ్యలో కదిలివచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 4,000 మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. ఇందులో కేవలం ప్రొఫెషనల్ అథ్లెట్లు మాత్రమే కాకుండా, పాఠశాల, కళాశాల విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగులు , రక్షణ రంగ సిబ్బంది తరలి వచ్చారు. 5 కి.మీ, 10 కి.మీ , హాఫ్ మారథాన్ విభాగాలలో ఈ రన్ జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, రన్నర్లను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా చీఫ్ జనరల్ మేనేజర్ వివేకానంద చౌబే , ఇతర జనరల్ మేనేజర్లు మాట్లాడుతూ.. కేవలం బ్యాంకింగ్ సేవలే కాకుండా, దేశాభివృద్ధిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ , సామాజిక బాధ్యత పై ఎస్‌బీఐ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. స్థిరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, పచ్చని చైన్నె కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


