
ఆకట్టుకున్న కళా ప్రదర్శన
తిరుత్తణి: వినాయకచవితి సందర్భంగా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన కళా ప్రదర్శన ఆకట్టుకుంది. తిరుత్తణిలోని దళపతి వినాయకం మెట్రిక్ పాఠశాల ఆధ్వర్యంలో బుధవారం చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మట్టి వినాయకుడిని ప్రతిష్టించి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కళా ప్రదర్శన ఆకట్టుకుంది. మురుగన్, వినాయకుడు, సరస్వతీ దేవి. లక్ష్మీదేవి, నారదుడు, శివపార్వతుల వేషధారణలో నాటకం ప్రదర్శించి అమితంగా ఆకట్టుకున్నారు. విద్యార్థులను కర స్పాండెంట్ సత్కరించారు.