
నచ్చితేనే అంగీకరిస్తున్నా!
తమిళసినిమా: నటి అర్చన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎన్నో అద్భుతమైన కథా పాత్రలకు ప్రాణం పోసిన నటీమణి ఈమె. వీడు చిత్రంలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న అర్చన తెరపై కనిపించి చాలా కాలమైంది. చాలా గ్యాప్ తరువాత గాంధీ కన్నాడి అనే చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. దర్శకుడు బాలాజీ శక్తివేల్‌కు భార్యగా అర్చన నటించిన ఈ చిత్రం ద్వారా బుల్లితెర నటుడు కేపీవై బాలా కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనకు జంటగా నమి తా కృష్ణమూర్తి నటించిన ఈ చిత్రానికి షరీఫ్ దర్శకత్వం వహించారు. ఆదిమూలం క్రియేషన్స్ పతాకంపై జయకిరణ్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్– మెర్విన్ ద్వయం సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న తెరపైకి రానుంది. ఈ సంద ర్భంగా బుధవారం చైన్నెలోని పరిణయం స్టూడియోలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్చ న మాట్లాడుతూ తనకు పది చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా అందులో కొన్ని చిత్రాల్లోనే నటిస్తున్నానని చెప్పారు గాంధీ కన్నాడి కథ నచ్చడంతో అందులో కన్నమ్మ అనే పాత్రను పోషించినట్లు చెప్పారు. గాంధీ కన్నాడిలో నటించడం సంతోషంగా ఉందని బాలాజీ శక్తివేల్ పేర్కొన్నారు.ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను శక్తి ఫిలిం ఫ్యాక్టరీ అధినేత శక్తివేల్ పొంది విడుదల చేస్తున్నారు.