
సృజనాత్మక ఆవిష్కరణలకు వేదికగా డిజైన్ థింకింగ్
సాక్షి, చైన్నె: సృజనాత్మక ఆవిష్కరణలకు, సంస్కృతి నిర్మాణాలకు వేదికగా డిజైన్ థింకింగ్ శిక్షణ నిలుస్తున్నట్టు ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ వీసీ ముత్తమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు. సోమవారం ఎస్‌ఆర్‌ఎంఐఎస్‌టీ స్కూల్ ఆఫ్ డిజైన్ థింకింగ్ నేతృత్వంలో మూడు రోజుల ప్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఇందులో డిజైన్ థింకింగ్ సంస్కృతిని పొందుపరిచే లక్ష్యంతో ఒక మూలస్తంభంగా తీర్చిదిద్దే విధంగా కార్యక్రమాలు జరిగాయి. రేపటి ప్రపంచానికి వినూత్న ఆలోచనలను అందించే విధంగా అవగాహనలు జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ డిజైనింగ్ గురించి అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఇంటెలెక్ట్ డిజైన్ వేదికగా రానున్న 5 సంవత్సరాల పాటూ ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో వీసీ ముత్తమిళ్ సెల్వన్, డైరెక్టర్ డాక్టర్ శాంతను పాటిల్, ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్ ఇండియా సౌత్ ఆసియా సీఈఓ రమణన్, ఎస్వీ స్కూల్ ఆఫ్ డిజైన్ థింకింగ్ డైరెక్టర్ మంజు జైన్ పాల్గొని డిజైనింగ్, సంస్కృతి, కొత్త అంశాలు, కొత్త బెంచ్ మార్కుల సృష్టి గురించి వివరించారు.