
ఘనంగా కెప్టెన్ జయంతి వేడుకలు
తిరుత్తణి: కెప్టెన్ విజయకాంత్ జన్మదినం సందర్భంగా డీఎండీకే శ్రేణులు వేడుకలు కోలాహలంగా నిర్వహించి పేవలకు సహాయకాలు పంపిణీ చేశారు. తిరుత్తణి పట్టణ డీఎండీకే కార్యదర్శి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో పట్టణంలోని చిత్తూరు రోడ్డు, ఎగువ తిరుత్తణి, బస్టాండు, అరక్కోణం రోడ్డు, గాంధీరోడ్డు సహా పలు ప్రాంతాల్లో విజయకాంత్ చిత్రపటాలు ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమాల్లో ఆ పార్టీ తిరువళ్లూరు వెస్ట్ జిల్లా కార్యదర్శి డి.కృష్ణమూర్తి పాల్గొని విజయకాంత్ చిత్రపటాలకు నివాళులలర్పించి పేదలకు సహాయకాలు పంపిణీ చేశారు. అందరికీ అన్నదానం పంపిణీ చేశారు. అలాగే పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరువలంగాడు మండలాల్లో విజయకాంత్ జయంతిని నిర్వహించారు.