
క్లుప్తంగా
లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి
తిరుత్తణి: లారీ ఢీకొని కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన కనకమ్మసత్రంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు సంఘటన వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని సొరకాయపేట గ్రామానికి చెందిన యువరాజ్(32) ఆవడి పోలీస్ బెటాలియన్‌లో పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. యథాప్రకారం శనివారం విధులకు వెళ్లి రాత్రి స్కూటీలో సొరకాయపేటలోని ఆదివారం తెల్లవారుజామున ఇంటికి పయనిస్తుండంగా, చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో కనకమ్మసత్రం సమీపంలోని కాంచీప్పాడి వద్ద రోడ్డు విస్తరణ పనుల కోసం వినియోగిస్తున్న లారీ స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో యువరాజ్‌కు తలపై తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు వెంటనే 108 ఆంబులెన్స్ ద్వారా తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువరాజ్‌కు భార్య ఇద్దరు పిల్లలుండడం గమనార్హం.
రూ.8.5 కోట్ల ఖర్చుతో
ప్రవేశ ద్వారం
తిరువొత్తియూరు: మెట్రో రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటనలో చైన్నె మెట్రో రైల్ లిమిటెడ్, నంగనల్లూర్ రోడ్ మెట్రో రైల్ స్టేషన్‌లో ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ సమీపంలో కొత్త ప్రవేశ, నిష్క్రమణ ద్వారం నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. దీని ప్రకారం రూ.8.52 కోట్ల వ్యయంతో కొత్త ప్రవేశ, నిష్క్రమణ ద్వారం నిర్మించబడుతోంది. నంగనల్లూర్ రోడ్ మెట్రోలో ప్రస్తుతం ఒకే ఒక ద్వారం ఉంది. అందువల్ల ఇప్పుడు కొత్తగా నిర్మించబడుతున్న ద్వారం జి.ఎస్.టి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రయాణికులకు మెట్రో స్టేషన్‌కు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. చైన్నె మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జునన్ సమక్షంలో జనరల్ మేనేజర్ లివింగ్‌స్టన్ ఎలియాజర్ (ప్లానింగ్, షెడ్యూలింగ్ – డిజైన్), ప్రైవేట్ సంస్థ అధికారి వినోద్ రాఘవేంద్రన్ కొత్త ద్వారం నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మెట్రో సంస్థ కాంట్రాక్ట్ ప్రొక్యూర్మెంట్, మేనేజ్‌మెంట్ జనరల్ మేనేజర్ జెఫ్ సెల్విన్ క్లాట్సన్ తదితరులు పాల్గొన్నారు.
కంభన్ జీవిత చరిత్రపై
విద్యార్థులు అవగాహన
వేలూరు: కంభన్ జీవిత చరిత్రపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు, కంభన్ సంఘం అధ్యక్షుడు జీవీ సెల్వం అన్నారు. వేలూరు కళాశాల, కంభన్ సంఘం సంయుక్తంగా వేడుకలు నిర్వహించాయి. ఈ సందర్భంగా జీవీ సెల్వం రచయితలు, కవులను సన్మానించి ప్రసంగించారు. విద్యార్థులు మేధాశక్తితో ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రపంచవ్యాప్తంగా తిరుక్కురళ్ దినోత్సవం జరుపుకోవాలన్నారు. రామాయణం, మహాభారతం భారతదేశంలో ప్రసిద్ధి చెందాయని, రామాయణం అన్ని భాషల్లో అనువదించబడిందన్నారు. హిందీ, తెలుగు, థాయ్ తదితర అనేక భాషల్లో కంభన్ రామాయణం రాయబడిందన్నారు. ప్రతి ఒక్కరు కంబ రామాయణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాలను కంబ రామాయణం చరిత్ర పొందుపరచుందన్నారు. ఈ కార్యక్రమంలో కంభన్ సంఘం కార్యదర్శి సోలయినాథంతో పాటు జిల్లాలోని రచయితలు, కవులు, తమిళ పండితులు, విద్యార్థినీవిద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పోలీసులు తరచూ
వైద్య పరీక్షలు చేసుకోవాలి
వేలూరు: పోలీసులు తరచూ పని ఒత్తిడిలో ఉన్న కారణంగా వైద్య పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎస్పీ మెయిల్ వాహనం అన్నారు. వేలూరు పోలీస్ కళ్యాణ మండపంలో శ్రీ నారాయణ ఆసుపత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆయన ప్రారంభించి వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు తరచూ పని ఒత్తిడిలో ఉంటారని, వారి ఆరోగ్యం గురించి చూసుకోరన్నారు. కుటుంబాల కన్నా పోలీస్ ఉద్యోగాలపైనే అధిక సమయం కేటాయిస్తున్నందున పని ఒత్తిడిలో తరచూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందుకోసమే పోలీసులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి శారీరక వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం అవసరమైన వారికి శ్రీనారాయణి ఆసుపత్రిలో చికిత్సలు చేసేందుకు పోలీస్ శాఖ సాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భాస్కర, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

క్లుప్తంగా