
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం
– బోర్డు సమావేశంలో నిర్ణయం
సాక్షి, చైన్నె: జర్నలిస్టుల సంక్షేమాన్ని కాంక్షించే వివిధ పథకాల అమలు దిశగా గురువారం జర్నలిస్టు సంక్షేమ బోర్డు 9వ కమిటీ సమావేశం జరిగింది. సమాచారశాఖా మంత్రి ఎంపీ స్వామినాథన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సమాచార కార్యదర్శి రాజారామన్, కార్మిక సంక్షేమం, నైపుణ్యాల అభివృద్ధి శాఖ కార్యదర్శి వీరరాఘవరావు, పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి కేఎం సరయు, ప్రజా సంబంధాల విభాగం డైరెక్టర్ ఆర్ వైద్యనాథన్, అదనపు డైరెక్టర్ సెల్వరాజ్, జర్నలిస్టు వెల్ఫేర్ బోర్డు నాన్ అఫిషియల్ సభ్యులు శివంది ఆదిత్యన్ బాలసుబ్రమణియన్, ఆర్‌ఎంఆర్ రమేష్, నక్కిరన్‌గోపాల్, పి.కోలప్పన్, సుబ్రమణియన్, తంబి తమిళరసన్, ఎస్.గవాస్కర్, ఎం.రమేష్, టి.తమిళరసితోపాటు అధికారిక సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో పెన్షన్లు కోరిన 42 మంది జర్నలిస్టుల విజ్ఞప్తులు, కుటుంబ సహా య నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 8 మంది అభ్యర్థలను స్వీకిరంచారు. అలాగే సమావేశంలో 2024 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 2025 జూన్ 15వ తేదీ వరకు 29 మంది జర్నలిస్టుల సంక్షేమ బోర్డు సభ్యులకు రూ. 3,83,500ను గ్రాంట్‌ను సంక్షేమ బోర్డు ఆమోదించింది. దీనిని జర్నలిస్టు వెల్ఫేర్ బోర్డు సభ్యులకు అందించనున్నారు. అలాగే, రాబోయే విద్యా ప్రోత్సాహం, సహజ మరణాలు, అంత్యక్రియలకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు ఈసందర్భంగా కొత్తగా వివిధ సంక్షేమ పథ కాలు, సభ్యత్వం గురించి సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.