రైలు కిందపడి ప్రియుడి ఆత్మహత్య
● మనస్తాపంతో ప్రియురాలు బలవన్మరణం
వేలూరు: తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని అంగీకరించక పోవడంతో ఓ ప్రేమికుడు రైలు కిందపడి మృతి చెందాడు. విషయం తెలిసి ప్రియురాలు మనస్తాపంతో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈఘటన ఆంబూరు సమీపంలో చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని పెరియాంకుప్పం గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ కుమారుడు గోకుల్(20). ఇతను కర్ణాటకలోని ప్రయివేటు నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇదిలాఉండగా జోలార్‌పేట సమీపంలోని కావేరిపట్టు గ్రామానికి చెందిన ఆనుముత్తు కుమార్తె ధరణి (20). ఈమె కూడా అదే కళాశాలలో చదువుతోంది. వీరిద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో ధరణి గర్భం దాల్చింది. నితిన్‌రాహుల్ కుటుంబసభ్యులకు తెలియజేసి వివాహం చేయాలని కోరాడు. ఇందుకు కుటుంబసభ్యు లు అంగీకరించలేదని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన నితిన్‌రాహుల్ శుక్రవారం రా త్రి పెరియాంకుప్పం ప్రాంతంలోని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ధరణి శనివారం ఉదయం వానియంబాడి రైల్వేస్టేషన్‌కు చేరుకొని తిరువనంతపురం– చైన్నె వెళ్లే ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ధరణిని రైలు ఢీకొనడంతో ఆమె గర్భంలోని చిన్నారి బయటకు వచ్చి పడింది. ఈ విషయం తెలుసుకున్న జోలార్‌పేట రైల్వే పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కిందపడి ప్రియుడి ఆత్మహత్య


