నిఘా నీడలో యూపీఎస్సీ ప్రిలిమినరీ
●24 వేల మంది హాజరు
సాక్షి, చైన్నె: యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష రాష్ట్రంలో ఆదివారం నిఘా నీడలో జరిగింది. కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ అభ్యర్థులు పరీక్షక్షకు హాజరయ్యారు. చైన్నె, తిరుచ్చి, వేలూరు, కోయంబత్తూరు, మదురై కేంద్రాల్లో 24 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వివరాలు.. దేశంలో ఖాళీగా ఉన్న ఐఎఎస్, ఐపీఎస్ తదితర పోస్టుల భర్తీ నిమిత్తం యూపీఎస్సీ ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఐఎఎస్,ఐపీఎస్ కావాలన్న ఆశతో పరీక్ష నిమ్తితం అభ్యర్థులు ప్రత్యేక శిక్షణ సైతం పొందారు. ఈ మేరకు ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరిగింది. రాష్ట్రంలో చైన్నె, మదురై, కోయంబత్తూరు, వేలూరు తిరుచ్చి నగరాల్లో ఎంపిక చేసిన సెంటర్లలో పరీక్షలు జరిగాయి. చైన్నెలో ఎగ్మూర్, విల్లివాక్కం, అన్నానగర్, పురసైవాక్కం పెరంబూరు, టీనగర్, ట్రిప్లికేన్, రాయపేట, వెప్పేరి తదితర కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 24 వేల మంది హాజరయ్యారు.
కట్టుదిట్టంగా ఆంక్షలు
ఉదయం ఏడున్నర గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీల అనంతరం లోనికి అనుమతించారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు , మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు నిఘా నీడలో పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నిఘా నీడలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వని రీతిలో ఈపరీక్షలు జరిగాయి. ఇందులో ఉత్తీర్ణులయ్యే వారికి మెయిన్స్, ఆతదు పరి ఉతీర్ణత , మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు సాగనున్నాయి. కాగా, ఆదివారం జరిగిన పరీక్షలు అనేక చోట్ల అభ్యర్థులను గందరగోళంలో పడేశాయి. కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద కేవలం హిందీలోమాత్రమే సమాచారాలు ఇవ్వడంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు. ఇది తమిళనాట వివాదానికి దారితీసింది. అలాగే ఉదయం జరిగిన పరీక్షలో ఓ ప్రశ్నకు ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ పేరును ఈవీ రామస్వామి నాయకర్ అని పొందు పరచడం చర్చకు దారి తీసింది. మహిళా అభ్యన్నతి, కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆయన పేరు ను కులం పేరుతో సహా ముద్రించడాన్ని తమిళ పార్టీలు, సంఘాలు వ్యతిరేకించే పనిలో పడ్డాయి.


