చైన్నెలోని 50 ప్రదేశాల్లో ఉచిత తాగునీటి ఏటీఎంలు
కొరుక్కుపేట: ఉచిత స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం చైన్నె తాగునీటి బోర్డు చైన్నె నగర వ్యాప్తంగా 5 వేల నీటి పంపిణీ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు చైన్నెలో ప్రజలు తరచుగా గుమిగూడే ప్రదేశాలలో శుద్ధి చేసిన తాగునీటిని అందించడానికి మొదటి దశలో 50 తాగునీటి ఏటీఎంలను ప్రారంభించాలని ప్రణాళిక రచిస్తోంది. ఇవి త్వరలో వాడుకలోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. ఈ ఉచిత తాగునీటి ఎటీఎంలు బీచ్‌లు, బస్సు స్టాండ్‌లు, పార్కులు, పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్ ప్రాంతాలతో సహా 50 ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కాగా ఒక్కో నీటి ఏటీఎం యంత్రాన్ని ఏర్పాటు చేయడానికి రూ. 10 లక్షలు ఖర్చువుతుందని తెలిపారు. ఇవి 24 గంటలూ పనిచేసే సౌకర్యాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభిస్తారని సమాచారం.
వేలూరులో విజయ్
బూత్ కమిటీ భేటీ
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం బూత్ కమి టీ తదుపరి మహానాడుకు వేలూరును ఎంపి క చేశారు. మహానాడు తేదీని ఆపార్టీ నేత విజయ్ ప్రకటించనన్నారు. పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తున్న విజయ్ కోయంబత్తూరు వేదికగా రెండు రోజుల పాటుగా బూత్ కమిటీ మహానాడును ఇటీవల విజయవంతం చేసుకున్నారు. ఈ మహానాడు సమయంలో జనం విజయ్‌కు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ఆపార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలో జిల్లాల కార్యదర్శుల సమావేశాలు విస్తృతంగా జరుగుతూ వస్తున్నాయి. ఈనెలాఖరులోపు అన్ని ప్రక్రియలను ముగించి జూన్ రెండో వారం లేదా మూడో వారం నుంచి ప్రజల్లోకి చొచ్చుకెళ్లే కార్యక్రమాలకు విజయ్ సన్నద్దం అవుతున్నారు. ఈ పరిస్థితులలో వేలూరు, రాణి పేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, కడలూరు,కృష్ణగిరి తదితర జిల్లాలతో కూడిన బూత్ కమిటీల మహానాడును వేలూరులో నిర్వహించేందుకు ప్రస్తుతం నిర్ణయించారు. ఇందుకోసం స్థల పరిశీలనపై పార్టీ వర్గాలు దృష్టి పెట్టాయి. మహానాడు ఎప్పుడు అన్నది విజయ్ ఒకటి రెండు రోజులలో తేదిని ప్రకటించనున్నారు. ఈ విషయంగా పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ మాట్లాడుతూ తదుపరి మహానాడుకు సన్నద్దమయ్యామన్నారు. 2026 ఎన్నికలలో డీఎంకే, బీజేపీ కూటమితో పొత్తు ప్రసక్తే లేదని మరో మారు ఆయన స్పష్టం చేశారు.
మదురై ఆధీనం మఠాన్ని
ముట్టడించే యత్నం
● 50 మందికి పైగా అరెస్టు
కొరుక్కుపేట: మదురై ఆధీనం మఠాన్ని దిగ్బంధించడానికి యత్నించిన 50 మందికి పైగా అరెస్టు చేశారు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా జ్ఞాన సంబంధ దేశికర్ మాట్లాడుతున్నారంటూ మదురైలోని మత సామరస్య ప్రజా కూటమి తరపున సోమవారం నిరసన చేపట్టారు. న్యాయవాది వాంచినాథన్ అధ్యక్షత వహించారు. నిరసనలో పాల్గొన్న వారు మాట్లాడుతూ మతసామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్న జ్ఞాన సంబంధ దేశికర్‌ను మఠం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లతో నినాదాలు చేశారు. కాగా మదురై ఆధీన మఠాన్ని ముట్టడించడానికి బయలుదేరిగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
ఆరు కొత్త థింక్ గ్యాస్
డిస్పెన్సింగ్ స్టేషన్ల ఏర్పాటు
సాక్షి, చైన్నె: థింక్ గ్యాస్ ఆరు కొత్త డిస్పెన్సింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని, ఎల్‌ఎన్‌జీ అడుగు జాడలలో విస్తరణకు చర్యలు చేపట్టామని ఆ సంస్థ ఎండీ అభిలేష్ గుప్తా తెలిపారు. కొత్త స్టేషన్ల గురించి సోమవారం స్థానికంగా ఆయన ప్రకటించారు. పర్యావరణ పరివర్తనను వేగవంతం చేస్తున్నామన్నారు. బోపాల్‌లోని ఫ్లాగ్‌షి్‌ప్ ఎల్‌ఎన్‌జీ స్టేషన్ లో విజయవంతమైన ఆపరేషన్ తర్వాత 3 కొత్త ఫిల్లింగ్ హబ్‌లు, పాయింట్‌ల వ్యూహాత్మక అమలుతో సుదూర హెవీ డ్యూటీ ట్రక్ మొబిలిటీ కోసం చర్యలు తీసుకున్నామన్నారు. ఏజీ అండ్ పీ ప్రథమ్ , థింక్ గ్యాస్ విలీన సీజీడీ సంస్థగా ప్రస్తుతం థింక్ గ్యాస్ బ్రాండ్ కింద పనిచేస్తున్నాయని వివరించారు. సుదూర సేవలందించడానికి వ్యూహాత్మకంగా ఉన్న 3 కొత్త ఇంధన కేంద్రాలు, పాయింట్లు కాంచీపురం జిల్లా వల్లం, అనంతపురం, నెల్లూరు ఉంటాయన్నారు. సెప్టెంబర్ 25 నాటికి ఇవి పనిచేయడం ప్రారంభిస్తాయని భావిస్తున్నామన్నారు. అదనంగా, డిసెంబర్ 2025 నాటికి మరో 3 ఇంధన కేంద్రాలు, పాయింట్లు పనిచేయడం ప్రారంభిస్తామన్నారు.
చైన్నెలోని 50 ప్రదేశాల్లో ఉచిత తాగునీటి ఏటీఎంలు


