పశువులకు కోమారి వ్యాధి టీకాలు తప్పనిసరి
వేలూరు: జిల్లాలోని పశువులకు, మేకలకు తప్పనిసరిగా కోమారి వ్యాధి టీకాలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కేవీకుప్పం సమీపంలోని బీఎన్ పాళ్యం గ్రామంలో వ్యాధి టీకాలను వేసే ప్రక్రియను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల వర్షాలు అధికంగా కురిసిన నేపథ్యంలో పశువులకు కోమారి వ్యాధి శోకే అవకాశం ఉన్నందున పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభించారన్నారు. రైతులు ఉచితంగా అన్ని పశువులు, మేకలకు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించుకోవడం ద్వారా వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చాన్నారు. కార్యక్రమంలో పశు సంవర్థశాఖ జాయింట్ డైరెక్టర్ మణిమారన్, అసిస్టెంట్ డైరెక్టర్ అందువాన్ పాల్గొన్నారు.


