సెయిలింగ్ పోటీలపై సమీక్ష
డ్రైవర్లు సెల్‌ఫోన్
వాడడంపై నిషేధం
కొరుక్కుపేట: పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను అరికట్టే ప్రయత్నంలో చైన్నె మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్లు పని వేళల్లో సెల్ ఫోన్‌లను తీసుకెళ్లడం, ఉపయోగించడాన్ని నిషేధించే కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విషయంలో జారీ చేసిన సమాచారంలో మెట్రోపాలిటన్ ట్రానన్స్‌పోర్ట్ కార్పొరేషన్ భద్రత, విపత్తు నిర్వహణ విభాగం ఇటీవల రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల ప్రమాదాలపై జరిపిన అధ్యయనంలో బస్సులను నడుపుతున్నప్పుడు డ్రైవర్లు సెల్‌ఫోన్లలో మాట్లాడుతున్న సంఘటనలు కనుగొనబడ్డాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్ వాడడంతో పరధ్యానం ఏర్పడుతుందని, ప్రమాదాలు గణనీయంగా పెరుగుతుంది. సెల్‌ఫోన్లను కండక్టర్‌కు అప్పగించాలని, పని పూర్తయిన తర్వాత వాటిని తిరిగి పొందవచ్చు.


