భార్యపై అనుమానంతో.. | - | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానంతో..

May 16 2025 1:33 AM | Updated on May 16 2025 1:33 AM

భార్య

భార్యపై అనుమానంతో..

● అత్త, ఇద్దరి బంధువులను హత్య చేసిన భర్త ●రాణిపేట జిల్లాలో సంచలనం

వేలూరు: రాణిపేట జిల్లా షోలింగర్‌ సమీపంలోని పుదుగుడియనూరు గ్రామానికి చెందిన బాలు(30) కూలీ కార్మికుడు. ఇతనికి వాలాజ సమీపంలోని కీల్‌ పుదుపేట గ్రామంలోని రాజంద్రన్‌ కుమార్తె భువనేశ్వరి(26)తో కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నాలుగు సంవత్సరాల కుమారుడున్నారు. బాలు ఇంటి ఎదురుగా విజయ్‌ అనే యువకుడు తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా భువనేశ్వరికి, ఇంటి ఎదురుగా ఉన్న విజయ్‌కి అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. దీంతో బార్య భర్తల మధ్య తరచూ ఘర్షణలు వచ్చేవి. దీంతో పది నెలల క్రితం భువనేశ్వరి భర్తను వదిలిపెట్టి కీల్‌పుదుపేటలోని అమ్మగారింటికి వెల్లింది. అయితే ప్రస్తుతం భువనేశ్వరి ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది. భార్య విడిచి వెల్లడంతో బాలు తరచూ మద్యం తాగేవాడు. బుధవారం సాయంత్రం బాలు అధికంగా మద్యం సేవించి రాత్రి 9 గంటల సమయంలో కీల్‌ పుదుపేటలోని అత్తగారింటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య భర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. అల్లుడిని అత్త భారతి(47) నిలదీసింది. దీంతో ఆగ్రహించిన బాలు కత్తితో ఆమెను నరికేందుకు యత్నించాడు. దీంతో భారతి అక్కడ నుంచి పరుగులు తీసింది. అయినప్పటికీ వెంబడించి భారతిని హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి భారతి అక్కడక్కడే మృతి చెందింది. తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె తప్పించుకు పారిపోయింది.

విజయ్‌ లేకపోవడంతో..

దీంతో బాలు సొంత గ్రామానికి చేరుకొని భార్యతో అక్రమ సంబందం పెట్టుకున్న విజయ్‌ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విజయ్‌ లేకపోవడంతో అతని తండ్రి అన్నామలై(60) నిలదీశాడు. తర్వాత ఇనుప రాడ్డుతో అన్నామలైని హత్య చేశాడు. వీటిని గమనించిన విజయ్‌ తల్లి రాజేశ్వరి(55) కేకలు వేయడంతో అదే ఇనుప రాడ్డుతో రాజేశ్వరిని హత్య చేసి అక్కడ నుంచి పరుగులు తీశారు. ఒకే రోజు అత్తతో పాటు సొంత గ్రామంలోని బంధువులు ఇద్దరిని హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి బాలు కోసం గాలించారు. ఉదయం వాలాజ సమీపంలోని కులత్తేరి గ్రామంలో దాగి ఉన్న బాలును పట్టుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో బాలు పరుగులు తీయడంతో కింద పడి కాలు విరిగింది. పోలీసులు అతన్ని పట్టుకొని వాలాజ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఈ మేరకు వాలాజ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నా. భార్య అక్రమ సంబందం పెట్టుకుందన్న ఆగ్రహంతో మద్యం మత్తులో అత్తతో పాటు సొంత గ్రామంలోని ఇద్దరిని హత్య చేసిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది.

భార్యపై అనుమానంతో..1
1/2

భార్యపై అనుమానంతో..

భార్యపై అనుమానంతో..2
2/2

భార్యపై అనుమానంతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement